‘‘నేను కొబ్బరిబొండంలా గుండ్రంగా ఉండను, కొంచెం లావుగా ఉంటాను.. అంతే. అలా ఉండటంవల్ల నాకే మాత్రం ఇబ్బందిలేదు’’ అంటున్నారు విద్యా బాలన్. నేటి తరం కథానాయికలతో పోల్చితే విద్యాబాలన్ కొంచెం బొద్దుగానే ఉంటారు. ఆ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘చిన్నప్పుడు నేను బొద్దుగా ఉండటం వల్ల అందరూ వచ్చి నా బుగ్గలు పట్టుకుని లాగేవారు. చాలా ముద్దుగా ఉన్నావని అనేవారు. అయితే వయసు పెరిగేకొద్దీ ‘తగ్గాలమ్మాయ్’ అనే మాటలు మొదలయ్యాయి.‘నీ ముఖం చాలా అందంగా ఉంది. కానీ కొంచెం లావు తగ్గితే బావుంటుంది కదా’ అనేవారు. ‘ఏం.. మీకు బుర్ర పెరగలేదా?’ అని వాళ్లను అడగాలనిపించేది. కానీ టీనేజ్‌లోకి ఎంటర్ అయినప్పుడు అబ్బాయిల నుంచి కాస్త అటెన్షన్ కోరుకుంటాం. అది లేనప్పుడు బాధ అనిపిస్తుంది. ఆ ఫీలింగ్‌ను, బాధను మాటల్లో చెప్పలేం. ఆ సమయంలో లావు గురించి ఆలోచించటం మొదలుపెట్టాను. లావు తగ్గాలని చాలా పిచ్చి పనులు చేశాను. రోజుకు పది లీటర్లు నీళ్లు తాగితే సన్నబడతావని చెబితే, తాగడం మొదలుపెట్టాను. కొన్ని వారాల తర్వాత ఓ రోజు రాత్రి నాకు విపరీతంగా వాంతులు అయ్యాయి.
వాటర్ ప్రయోగంతో వాంతులు
Related tags :