Politics

నేను ఆశిస్తున్నాను…

నేను ఆశిస్తున్నాను…

విశాఖ కాపులుప్పాడiలో ప్రభుత్వ గెస్ట్‌ హౌస్‌ నిర్మాణంపై…కేంద్ర పర్యాటక శాఖమంత్రికి ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవ భూములపై విచారణను స్వాగతిస్తున్నానన్నారు. ఆవ భూముల కేసును సీబీఐ విచారణ చేస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. సీఎం జగన్‌ తన పారదర్శకత నిరూపించుకోవాలన్నారు. మాటల్లోనే కాదు.. చేతల్లోనూ సూపర్‌ అని… జగన్‌ నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తణుకు, ఆచంటలో జరిగిన అవినీతిపై విచారణ చేయించాలని, రూ.500 కోట్ల నష్టానికి బాధ్యులెవరని సీఎంను ప్రశ్నిస్తున్నానని రఘురామ అన్నారు. అంబటి కృష్ణారెడ్డికి కేబినెట్‌ హోదా కల్పించారని రఘురామకృష్ణం రాజు అన్నారు. కులాన్ని బట్టి పోస్టు కాదని.. అర్హతలను బట్టి పోస్టులు ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తన సలహాదారులను తగ్గిస్తే మంచిదని.. ఇది తన అభిప్రాయం కాదని.. ప్రజాభిప్రాయమని రఘురామ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. పరిస్థితి ఇలాగేకొనసాగితే బిల్డర్లు ఆత్మహత్య చేసుకోవడమేనని, భవన కార్మికులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘పెయిడ్‌ ఆర్టికల్స్‌ నిజం కావు, మన పేపర్‌లో వచ్చేవన్నీ నిజం కావు, మీరు అన్ని సమస్యలను పరిష్కరించగలరన్న నమ్మకముందని’ రఘురామ వ్యాఖ్యానించారు