Sports

దినేశ్ కార్తీక్ ప్రదర్శనపై అనుమానాలు

దినేశ్ కార్తీక్ ప్రదర్శనపై అనుమానాలు

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తిక్‌ ఒక్కసారి క్లిక్‌ అయితే మళ్లీ టీ20ల్లో టీమ్‌ఇండియాకు ఎంపికయ్యే అవకాశముందని, అయితే అతడలా చేయగలడా అనేదే ప్రశ్నగా మిగిలిందని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. తాజాగా అతడు ఫేస్‌బుక్‌లో అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా ఒకతను డీకేపై అడిగిన ప్రశ్నకు ఇలా స్పందించాడు. టీ20ల్లో ఐదో స్థానంలో రిషభ్‌ పంత్‌, మనీశ్‌ పాండే ఇంకా తమ స్థానాలను భర్తీ చేసుకోనందున ఈ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌, కీపర్‌కు అవకాశం ఉందా అని అడిగాడు. దానికి చోప్రా జవాబిస్తూ.. ‘మీరు చెప్పేది నిజమేనని నేనూ అనుకుంటున్నా. డీకే కచ్చితంగా తిరిగి జట్టులోకి రాగలడు. అయితే, అతడలా చేయగలడా లేదా అనేదే అసలైన విషయం’ అని పేర్కొన్నాడు.