Agriculture

తెలంగాణాలో ఆగని రెవెన్యూ ఉద్యోగుల దోపిడీ

తెలంగాణాలో ఆగని రెవెన్యూ ఉద్యోగుల దోపిడీ

రైతు వద్ద నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న డీఎస్పీ

నల్గొండ జిల్లాలోని పెద్ద అడిషర్ల పల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఓ రైతు నుంచి రూ.10 వేల లంచం తీసుకుంతుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏ సీబీ అధికారులకు చిక్కిన రెవిన్యూ ఇన్సెపెక్టర్(ఆర్ఐ) శ్యామ్ నాయక్……
భీమనపల్లి గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి అనే రైతు తనకు చెందిన 17 గుంటల వ్యవసాయ భూమిని మ్యుటేషన్ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వాలని తహసీల్దార్ న కు అర్జీ పెట్టుకున్నాడు. విచారణ చేపట్టి మ్యుటేషన్ చేయాలని రెవెన్యూ ఇన్సెపెక్టర్ శ్యామ్ నాయక్ ను ఎమ్మార్వో ఆదేశించారు. ఈ పనిని రైతునకు అనుకూలంగా చేయాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలని రెవెన్యూ ఇన్సెపెక్టర్ రైతు వెంకటరెడ్డి ని డిమాండ్ చేసాడు. దీంతో, రైతు అవినీతి నిరోధక శాఖ ( ఏసీబీ) అధికారులు ను ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం తహశీల్దార్ కార్యాలయంలో రైతు నుంచి ఆర్ఐ రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కృష్ణా వలపన్ని పట్టుకున్నారు. పంచనామా నిర్వహించిన అధికారులు అవినీతి అధికారి శ్యాం నాయక్ ను శనివారం హైదరాబాద్ లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.