* కార్మిఖశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్వగ్రామం అయిన కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరులో ఉద్రిక్తత…పేకాట స్థావరానికి వెళ్లిన వారిపై పేకాట రాయుళ్లు దాడి చేశారు. ‘మేము మంత్రి జయరాం అనుచరులం… మమ్మల్నే అరెస్టు చేస్తారా?’ అంటూ వారు పోలీసులను చితకబాదారు. ఘటనలో ఎస్సై సమీర్ బాషాకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించి 32 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరికొందరు పేకాటరాయుళ్లు పరారయ్యారు.మంత్రిగారి ఇలాకాలో పేకాట దందాఅనుచరులే నిర్వాహకులు.. కోట్లలో బెట్టింగులు…గుమ్మనూరులో ఎస్‌ఈబీ, పోలీసుల మూకుమ్మడి దాడులు…ఎదురుతిరిగిన పేకాటరాయుళ్లు.. 36 మంది అరెస్టు.పోలీసుల కళ్లల్లో కారం కొట్టిన పేకాట బాబులు…ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐకు గాయాలు35 వాహనాలు సీజ్, రూ.5.34 లక్షలు నగదు స్వాధీనంరాజకీయ ఒత్తిళ్లతో మంత్రి ముఖ్య అనుచరుల విడుదల?మీడియాపై మంత్రి సోదరుడి దూషణలు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం ‘గుమ్మనూరు’.. రాష్ర్టానికి చెందిన ఓ మంత్రి స్వగ్రామం. ఆ ఊరిలో భారీగా మద్యం డంప్ చేశారని, కోట్లాది రూపాయల బెట్టింగ్‌లతో పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారని ఎస్‌ఈబీ పోలీసులకు గురువారం అజ్ఞాత వ్యక్తులు ఉప్పందించారు. దీంతో మూడు బృందాలుగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఎస్.ఈ.బీ), పోలీసు అధికారులు మఫ్టీలో వెళ్లి మూకుమ్మడిగా దాడులు చేశారు. అక్కడ మద్యం లేనప్పటికీ.. భారీ స్థాయిలో పేకాట జరుగుతోంది. ఎస్‌ఈబీ అధికారులు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.అయితే.. మంత్రి గారి ఊళ్లోకే వచ్చి దాడులు చేస్తారా అంటూ పేకాటరాయుళ్లు, అక్కడ ఉన్న కొందరు వైసీపీ నాయకులు ఎదురు తిరిగి పోలీసుల కళ్లల్లో కారం కొట్టారు. వారంతా కలిసి పోలీసుల వాహనాల అద్దాలు పగలకొట్టారు. ఈ దాడిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సమీర్‌బాషా మెడ, తల భాగంలో గాయాలయ్యాయి.విషయం తెలుసుకున్న ఏఎస్పీ గౌతమ్‌శాలి, స్థానిక సీఐ భాస్కర్, మరింత మంది పోలీస్ బలగాలతో గుమ్మనూరు గ్రామాన్ని అదుపులోకి తీసుకుని 36 మందిని అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి రూ.5.34 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. 35 కార్లు, 6 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. పరారైన తొమ్మిదిమందిలో మంత్రి ముఖ్య అనుచరులు ఉన్నట్లు సమాచారం. కోట్లలో బెట్టింగ్‌లు!ఈ మొత్తం వ్యవహారంలో రూ.2కోట్లకు పైగా బెట్టింగ్ జరిగినట్లు సమాచారం. జిల్లాకు చెందిన ఓ మంత్రికి వరుసకు తమ్ముడైన ఓ వ్యక్తి ఈ పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. కాగా సదరు మంత్రి నేరుగా పలువురు అధికారులపై ఒత్తిడి తేవడంతో, పోలీసుల అదులో ఉన్న ఆయన ముఖ్య అనుచరులను అధికారులు వదిలివేశారని తెలుస్తోంది. మరోవైపు..ఘటనా స్థలంలో కొందరు మీడియా రిపోర్టర్లపై మంత్రి సోదరుడు దురుసుగా ప్రవర్తించారు.
* మిజోరాంలోని ఛాంపై జిల్లా మెల్‌బుక్ ప్రాంతంలో రూ .35 లక్షల విలువైన 10 వేల మెథాంఫేటమిన్ మాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు అస్సాం రైఫిల్స్ తెలిపింది.మెల్‌బుక్ ప్రాంతంలో కొందరు అక్రమంగా రవాణా చేస్తున్న మాత్రలను అస్సాం రైఫిల్స్‌లోని సెర్చిప్ బెటాలియన్ సిబ్బంది గుర్తించి పట్టుకున్నారు.మెథాంఫేటమిన్ కేంద్ర నాడీ వ్యవస్థను శక్తివంతంగా ప్రభావితం చేయడమే కాకుండా వ్యసన ఉద్దీపన కలగజేస్తుంది.యువత ఈ మాత్రలను మత్తుకోసం వినియోగిస్తుండటంతో అంతర్జాతీయంగా వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.
* భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశించారు.గురువారం రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు.ప్రభుత్వ భూముల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.ఈ మధ్య కాలంలో భూ ఆక్రమణలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయని కలెక్టర్ వెల్లడించారు.గ్రామ స్థాయిలో రెవిన్యూ అధికారులు ప్రభుత్వ భూముల వివరాలను 22ఏలో నమోదు చేయాలన్నారు.తహసీల్దార్లు సెప్టెంబరు 1 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రభుత్వ భూములు, వాటి ప్రస్తుత స్థితి వివరాలను సేకరించాలని కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశించారు.
* పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం బండకాడ పల్లి దళిత వాడకు చెందిన దళిత యువకుడు ఓం ప్రతాప్ మరణంపై వాస్తవాలను తెలుసు కునేందుకు మృతుని గ్రామంలో పర్యటనకై శుక్రవారం బయలుదేరిన టీడీపీ జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని , ఎమ్మెల్సీ దొరబాబు, మాజీమంత్రి అమరనాథ రెడ్డి, పుంగనూరు నియోజక వర్గ టీడీపీ ఇన్ చార్జ్ అనీషారెడ్డి ను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. దళిత యువకుని మరణంలో వైసీపీ నాయకుల పాత్ర లేకపోతే మృతుని కుటుంబాన్ని పరామర్శ చేసేందుకు వెళుతున్న ప్రతిపక్ష నేతలను ఎందుకు హౌస్ అరెస్టు చేశారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
* అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. అచ్చెన్నకు షరతులతో కూడిన బెయిల్ . కోర్టు అనుమతి లేకుండా దేశాన్ని విడిచి వెళ్లకూడదు . గత 70 రోజులుగా రిమాండ్ లో ఉన్న అచ్చెన్న. టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈఎస్ఐ స్కామ్ కేసులో రిమాండ్ లో ఉన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా దేశాన్ని విడిచి వెళ్లకూడదని అచ్చెన్నకు హైకోర్టు షరతు విధించింది. ఇటీవలే అచ్చెన్న కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. గత 70 రోజులుగా ఆయన రిమాండ్ లో ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు, అచ్చెన్నకు బెయిల్ మంజూరు కావడంతో ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.