కరోనా నేపథ్యంలో గత నెల 12వ తేదీనుంచి మూసివేసిన గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ ఎట్టకేళకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పునఃప్రారంభం కానుంది. ఈ మేరకు గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఏకగ్రీవంగా నిర్ణయించింది. కొవిడ్-19 కారణంగా మూసివేయడం వల్ల గత 45 రోజులుగా వస్తున్న విమర్శలకు తావీయకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తపేటలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏఎంసీ ఛైర్మన్ వీరమల్లు రామనర్సయ్యగౌడ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన పాలకవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ ప్రవీణ్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
వచ్చే వారం గడ్డి అన్నారం మార్కెట్ ప్రారంభం
Related tags :