Videos

జుట్టే చెట్టు…[Video]

జుట్టే చెట్టు…[Video]

అమెరికాకు చెందిన జోసెఫ్ గ్రిసామోర్ అనే వ్యక్తి తన జుట్టును ఏకంగా 42.5 ఇంచుల పొడవు పెంచేశాడు.

ఈ జుట్టును చూస్తే షాక్ అవ్వ‌డం మాత్రం ఖాయం. అంతేకాదు ఈ హెయిర్ స్టైల్‌ని ‘మోహాక్’ అని పిలుస్తారు.

త‌ల చుట్టూ ఉన్న హెయిన్ క‌ట్ చేసి మ‌ధ్య‌లో ఉన్న జుట్టును అలానే ఉంచేశాడు.

అంత పొడ‌వైన జుట్టుతో అత‌ను ఎక్క‌డి వెళ్లాల‌న్నా క‌ష్ట‌మే.

అంతేకాదు కారులో ప్రయాణించ‌డానికి వీలుప‌డ‌క బైక్ మీదే వెళ్తుంటాడు జోసెఫ్‌.

ఇత‌ని హెయిర్‌స్టెయిల్ మెయింటైన్ చేయ‌డానికి అత‌ని భార్య కూడా స‌హాయం చేస్తుంది.

జుట్టుకోసం అత‌ను ప‌డుతున్న క‌ష్టానికి గిన్సీస్ వరల్డ్ రికార్డ్ గుర్తించింది.

2017లో బ్రేక్ చేసిన రికార్డును జోసెఫ్ బ‌ద్ద‌లు కొట్టాడు.