‘‘ఎందుకు ఉండదు.. అందరిలాగే నేనూ. ఓ స్టార్ ఎలా ఉంటారు? వాళ్ల జీవితం ఎలా సాగుతుంది? ఏం తింటారు? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలని ఉండేది. పేపర్లు, టీవీల్లో నా అభిమాన తారల సంగతులు వచ్చినప్పుడు ఆసక్తిగా చదివేదాన్ని. షూటింగ్‌లు చూడాలని ఉండేది కానీ, ఎప్పుడూ ఛాన్స్ దొరకలేదు. అయితే సినిమాల్లోకి అడుగుపెట్టాక బయట జీవితం వేరు, సినిమాలు వేరు అని అర్థమైంది. చిత్రసీమలోకి వచ్చిన కొత్తలో చిత్రీకరణ వివరాలు, నేను పనిచేసిన హీరోలకు సంబంధించిన కబుర్లను నా స్నేహితులు అడిగేవారు. కొత్త కాబట్టి నేనూ ఏవేవో చెప్పేదాన్ని. ఇక తర్వాత నుంచి అంతా మామూలైపోయింది. అన్నట్లు నేను తొలిసారి చూసిన స్టార్స్ ఎవరో తెలుసా.. ఉపేంద్ర, కృతి కర్బంద. బెంగళూరులో చదువుకునే రోజుల్లో ‘ఫ్రెష్ ఫేస్’ అనే కాంపిటీషన్‌లో వాళ్లని చూశా. తర్వాత ముంబయికి వెళ్లినప్పుడు అక్షయ్ కుమార్, రానాలను చూశా’’.
ఉపేంద్రను మొదటిసారి చూశాను
Related tags :