అనారోగ్యం కారణంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జపాన్ ప్రధాని షింజో అబె శుక్రవారం ప్రకటించారు. తాను కొంతకాలంగా పెద్దపేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ‘ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఆత్మవిశ్వాసంతో ప్రజలను పాలించే స్థితిలో లేను. అందుకే ఇకపై ఆ పదవిలో కొనసాగకూడదని అనుకున్నాను. కరోనా వైరస్ క్లిష్టకాలం, పలు విధాన నిర్ణయాలు అమలు దశకు రాకముందే, ఏడాది పాటు పదవీకాలం మిగిలుండగానే.. రాజీనామా చేస్తున్నందుకు క్షమాపణలు కోరుతున్నాను’ అని ముందుకు వంగి ప్రజలను అభ్యర్థించారు. జపాన్ చరిత్రలో అత్యంత ఎక్కువకాలం పాలించిన ప్రధానిగా అబె ఖ్యాతి గడించారు.
మరోసారి ఆదర్శవంతంగా జపాన్ రాజకీయం
Related tags :