WorldWonders

ఎవరా డాలర్ బాయ్?

ఎవరా డాలర్ బాయ్?

తనను 139 మంది రేప్ చేశారంటూ ఓ యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో 139 మంది పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాధితురాలు వెల్లడించిన ప్రముఖుల పాత్రపై విచారణ జరుగుతోంది. పోలీసుల దర్యాప్తులో డాలర్ బాయ్ అనే వ్యక్తి బెదిరింపులు వెలుగు చూశాయి. డాలర్ బాయ్ పలువురికి ఫోన్‌లు చేసి బెదిరించినట్టు కూడా తెలుస్తోంది. డాలర్‌ బాయ్‌, డిటెక్టివ్‌ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో డాలర్‌ బాయ్‌ అరాచకాలపై బాధితులు ఫిర్యాదు చేశారు. ఘటనపై ఇప్పటికే యాంకర్ ప్రదీప్ స్పందించారు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారా అనే అంశంపై సైతం పోలీసులు దృష్టి సారిస్తున్నారు. ఓ కానిస్టేబుల్‌కి కాల్ చేసి.. ‘నీ భార్య‌తో నాకు అక్రమ సంబంధం ఉంది’ అంటూ వేధింపులకు దిగినట్టు తెలుస్తోంది. కుమార్ అనే పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు సమాచారం. ఆ కానిస్టేబుల్ పని చేస్తున్న స్టేషన్ ఎస్సైను అసభ్య పదజాలంతో దూషించినట్టు సమాచారం. డాలర్ బాయ్ అరాచకాలపై ఆడియో టేపులను కానిస్టేబుల్ పోలీసులకి అందజేసినట్టు తెలుస్తోంది.