Movies

రోజంతా విచారణ

Auto Draft

నటుడు సుశాంత్‌సింగ్‌ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి శుక్రవారం ఉదయం సీబీఐ ఎదుట హాజరైంది. ముంబయిలోని డీఆర్‌డీవో గెస్ట్‌హౌజ్‌లో రియా సహా ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తిని అధికారులు విచారిస్తున్నారు. వీరితోపాటు సుశాంత్‌ క్రియేటివ్‌ మేనేజర్‌ సిద్దార్థ్‌ పితాని, వంట మనిషి నీరజ్‌సింగ్‌, పనిమనిషి కేశవ్‌, ఇంటి మేనేజర్‌ సామ్యూల్‌లను కూడా దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే అధికారులు గతంలోనూ వీరిని పలుమార్లు విచారించారు. రియా సోదరుడు షోవిక్‌ను‌ గురువారం 14 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఉదయం ప్రారంభించిన విచారణ అర్ధరాత్రి వరకు కొనసాగింది.