Movies

“బ్లాక్ పాంథర్” మృతి

“బ్లాక్ పాంథర్” మృతి

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ రికార్డుల్ని షేక్‌ చేసిన ‘బ్లాక్‌ పాంథర్‌’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన చాడ్విక్‌ బోస్‌మన్‌(43) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా పెద్ద పేగు క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. తొలిసారి 2016లో క్యాన్సర్‌ మూడో దశలో ఉండగా గుర్తించినట్లు తెలిపారు. అనేక సార్లు శస్త్రచికిత్సలు, కీమోథెరపీ చేయించినప్పటికీ ఫలితం లేకపోయిందని వాపోయారు. నాలుగో దశకు చేరడంతో పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారని తెలిపారు.