NRI-NRT

భారతీయ యువతులకు బ్రిటీష్ ప్రభుత్వం బంపర్ ఆఫర్

భారతీయ యువతులకు బ్రిటీష్ ప్రభుత్వం బంపర్ ఆఫర్

మీరు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు గల భారతీయ యువతులా?అయితే భారత్‌లో బ్రిటిష్‌ హైకమిషనర్‌ కాగల అద్భుత అవకాశం మీదే! ఈ పదవిలో వీరు ఒక్కరోజు మాత్రమే ఉండగలరని అధికారులు వివరిస్తున్నారు. అక్టోబర్‌ 11 ‘అంతర్జాతీయ బాలికల దినోత్సవం’ సందర్భంగా భారతీయ యువతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ బ్రిటిష్‌ హై కమిషన్‌ ఓ ప్రకటన చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మహిళల సాధికారత, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి విస్తృత ప్రచారం కల్పించేందుకు ‘హై కమిషనర్‌ ఫర్‌ ఏ డే‌’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.