Health

కొబ్బరినూనె వాడితే శృంగార సామర్థ్యం పెరుగుతందంట!

కొబ్బరినూనె వాడితే శృంగార సామర్థ్యం పెరుగుతందంట!

కొబ్బరి నూనెతో సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా?

సెక్స్ సామర్థ్యం కోసం మీరు ఏ మాత్రం ఆందోళన చెందవద్దు. కొబ్బరి నూనెతో కలిగే ఈ ప్రయోజనాలు గురించి తెలిస్తే తప్పకుండా ఔరా అంటారు.

కొబ్బరి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలిసిందే. కొబ్బరిని నీళ్లలా తాగినా.. కొబ్బరి నూనెను తలకు రాసుకున్నా.. లేదా వంటల్లో వేసుకున్నా బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇక కొబ్బరి కోరుతో పచ్చడి చేస్తే.. ఆ టేస్టే వేరు కదూ. అయితే, సెక్స్ లైఫ్‌ను మరింత అందంగా.. టేస్టీగా మార్చేది మాత్రం కొబ్బరి నూనే! అదెలా అనుకుంటున్నారా? అయితే, తప్పకుండా ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవల్సిందే.

కొబ్బరి నూనెలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి, హృదయ కండరాల పనితీరు మెరుగుపడుతుంది. అందుకే గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు కొబ్బరి నూనె ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. అయితే, దీన్ని డైట్‌లో తీసుకొనే ముందు తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.

అపరిమిత అసంతృప్త కొవ్వుల వల్ల గుండెకు ముప్పు వాటిల్లుతుంది. అయితే కొబ్బరి నూనెతో మీకు ఆ సమస్య ఉండదు

సహజంగా లభించే సంతృప్త కొవ్వులు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. ఇవి ఎక్కువ శాతం కొబ్బరి నూనెలోనే ఉంటాయి. అందుకే దీన్ని మీడియం ట్రైగ్లిజరాయిడ్స్‌ అని కూడా అంటారు.

కొబ్బరి నూనెలో ఉండే ల్యూరిక్ యాసిడ్ అధిక వేడి, పిత్తాశయ సమస్యలకు, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్‌గా పనిచేస్తుంది. అంతేగాక తక్షణ శక్తిని సైతం అందిస్తుంది.

ఇతర ఆహారాల్లో ఉండే కొవ్వుల తరహాలో కొవ్వు కణాలను నిల్వ ఉంచదు. కాలేయంలోకి చేరి శక్తిని ఉత్పత్తి చేసేందుకు కూడా సహకరిస్తుంది.

కొబ్బరి నూనెలోని మీడియం ట్రైగ్లిజరాయిడ్స్ కారణంగా కొవ్వు పదార్థాలను జీర్ణం చేయడానికి పిత్తరసం అవసరం ఉండదు.

తల్లి పాల తరహాలోనే కొబ్బరి నూనెలో ఉండే ల్యూరిక్ యాసిడ్ శిలీంధ్ర, బ్యాక్టీయా, వైరస్ వినాశకారిగా పనిచేస్తుంది.

ఫ్రీ రాడికల్ దాడి నుంచి తట్టుకోడానికి, తక్కువ కార్బోహైడ్రేట్స్ కోసం చాలా మంది అథ్లెట్స్ వ్యాయామం తర్వాత ఆహారంలో కాస్త కొబ్బరి నూనె వేసుకుని తింటారు.

కొబ్బరి నూనె ఆరోగ్యకరమైన ఆహారంగానే కాక, సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. శరీరానికి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది.

కొబ్బరి నూనె జుట్టు రాలడాన్ని అరికడుతుంది. నూనె రాసుకోవడం ఇష్టం ఉండదని చెప్పకుండా.. తప్పకుండా అలవాటు చేసుకోండి.

కొబ్బరి నూనెలోని కీటోన్లు మెదడుకు స్థిరమైన శక్తిని సరఫరా అందిస్తాయి. కాబట్టి ఎపిలెప్సీ, అల్జీమర్స్ లాంటి వ్యాధులు, మెదడు సంబంధ అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఇది దోహదం చేస్తుంది.

కొబ్బరి నూనె పురుషుల్లో టెస్టోస్టెరాన్, మహిళల్లో ప్రొజెస్టిరినో హార్మోన్లును ఉత్పత్తి చేస్తుంది.

కొబ్బరి నూనె వల్ల సెక్స్ హార్మోన్లు ఉత్పత్తి మెరుగుతుంది. ఫలితంగా సెక్సులో మరింత మజాను పొందుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం కొబ్బరి నూనెను మీ డైట్‌లో భాగం చేసుకుని మాంచి సెక్స్ లైఫ్‌ను ఎంజాయ్ చేయండి.

2014లో ఓ అధ్యయనం ప్రకారం.. కొబ్బరి నూనె ఆరోగ్యకరమైన మాయిశ్చరైజర్ అని, అంగ ప్రవేశానికి కందెనగా కూడా వాడవచ్చని తేలింది. దీనివల్ల మరింత ఎక్కువ సేపు సెక్స్ చేయడం సాధ్యమవుతుందని వెల్లడైంది.

మార్మంగాలు పొడిబారే సమస్యను ఎదుర్కొనేవారు కొబ్బరి నూనె ద్వారా ఉపశమనం పొందవచ్చు.