పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటరులో 2021 జులై 2,3,4 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన తానా 23వ ద్వైవార్షిక మహాసభలు రద్దు చేయలేదని మహాసభల సమన్వయకర్త పొట్లూరి రవి పేర్కొన్నారు. శాస్త్రవేత్తల అవిరళ కృషితో విజయవంతంగా రూపొందే కరోనా టీకాతో పాటు, దైవబలం తోడుగా ఈ సభలు యథాతథంగా ప్రణాళికాబద్ధంగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. టీకా ఆలస్యమైన పక్షంలో తానా కార్యవర్గం తదుపరి నిర్ణయానికి అనుగుణంగా ఈ సభల నిర్వహణ ఉంటుందని రవి అన్నారు. సామాజిక దూరం, అతిథుల ఆరోగ్యం, పక్కాగా కరోనా నివారక చర్యలను దృష్టిలో ఉంచుకుని ఈ సభలను విజయవంతం చేసేందుకు తమ బృందం ప్రణాళికలు రూపొందిస్తోందని పొట్లూరి రవి వెల్లడించారు.
తానా 2021 మహాసభలు రద్దు చేయలేదు
Related tags :