NRI-NRT

కమలా కంటే కూతురే క్వాలిఫైడ్

కమలా కంటే కూతురే క్వాలిఫైడ్

డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న కమలా హారిస్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శలు గుప్పించారు. అధ్యక్షురాలు అయ్యే అర్హత కమల కంటే తన కుమార్తె ఇవాంక ట్రంప్‌కే ఎక్కువగా ఉందని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో శుక్రవారం న్యూహాంప్‌షైర్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు.