WorldWonders

నీ పాస్‌వర్డూ ఉచిత వైఫై మాకొద్దురా బాబూ!

నీ పాస్‌వర్డూ ఉచిత వైఫై మాకొద్దురా బాబూ!

సామాజిక మాధ్యమాల్లో ఎన్నో సరదా మెస్సేజ్‌లు, వీడియోలు చూస్తుంటాం. అందులో కొన్ని కడుపుబ్బా నవ్విస్తాయి. కొన్ని సార్లు వూహించిన దానికంటే భిన్నంగా ఉండి కోపం కూడా తెప్పిస్తాయి. అంతెందుకు మీకు ఫ్రీ వైఫై ఇస్తాం.. ఎంతైనా వాడు కోండి అంటే ఎగిరి గెంతేయరూ! పాస్‌వర్డ్‌ చెప్పండంటూ అవతలి వారి వెనకపడినా అశ్చర్యం లేదు. సరిగ్గా అదే ఆలోచనను పాల్బో రోచట్‌ అనే ఆర్ట్‌ డైరెక్టర్‌ క్యాష్‌ చేసుకున్నాడు. ‘‘ నా పక్కింటి వాళ్లు నా వైఫై నెట్‌వర్క్‌ను వాడుకోవచ్చు’’ అంటూ గోడకు ఓ కాగితాన్ని అంటించాడు. దాని కింద ‘నెట్‌వర్క్‌: గుడ్‌లక్‌’ అని రాస్తూ.. ఓ చాంతాడంత పాస్‌ వర్డ్‌ పెట్టాడు. ఆపాస్‌ వర్డ్‌ ఎంటర్‌ చేయాలంటే కనీసం అరగంటైనా పట్టొచ్చు. ఈలోపు ఏదైనా తప్పుగా ఎంటర్‌ చేస్తే.. ఇక అంతే సంగతి. పాస్‌వర్డ్‌ కరెక్టుగా కొట్టనూలేరు.. ఆ వైఫై వాడనూ లేరు అన్నట్లుగా ఆయన వరస. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం ఆ పాస్‌వర్డ్‌ ఎంతుందో మీరూ చూసేయండి.