DailyDose

నర్సును రేప్ చేసిన వైద్యుడు-నేరవార్తలు

నర్సును రేప్ చేసిన వైద్యుడు-నేరవార్తలు

* జిల్లాలోని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. స్టాఫ్ నర్స్‌పై వైద్యుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని రోజులుగా తన కోరిక తీర్చాలంటూ మహిళను వేధిస్తుండేవాడు. ఈనెల 24న మహిళ ఇంటికి వెళ్లిన వైద్యుడు.. నర్సుపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం తెలంగాణలో కలకలం రేగుతోంది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

* చెన్నై , బెంగుళూరు జాతీయ రహదారి బంగారుపాళ్యం మండలం బలిజిపల్లి గ్రామం దాభా వద్ద వెంకటేశ్వర్లు అతని కుటుంబం బెంగళూరు నుంచి తన సొంత గ్రామం అయిన నెల్లూరులో సైట్ విషయం పనిలో వెళ్తున్న సమయం లో తూ వ్హీలర్ అడ్డు రావడంతో అతనిని తప్పించబోయి అతనిని గుద్ది ఆగి ఉన్న లారీని ఢీ కొనడంతో అక్కడిక్కడే కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.టూ వీలర్ అతను అక్కడిక్కడే మృతి చెందాడు… వెంకటేశ్వర్లు రెడ్డి భార్య కు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడింది.. టూ వీలర్ అతను బంగారుపాళ్యం కు చెందిన బాబు (45).. వెంకటేశ్వర్లు (29)అమ్మ రత్నమ్మ (49), తండ్రి శ్రీనివాసులు రెడ్డి (55).

* తప్పిన పెను ప్రమాదం , వడ్లపూడి సిగ్నల్ పాయింట్ వద్ద లారీ క్యాబిన్ నుండి విడిపోయిన కంటైనర్ , వెనుక వాహనాలు లేకపోవడంతో తప్పిన ప్రమాదం , హుటాహుటిన ట్రాఫీక్ ను క్లియర్ చేసిన పోలీస్లు.

* చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్‌ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది.

* బంగారుపాళ్యం మండలం జాతీయ రహదారి బలిజపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి.

* అనంతపురం…….3 వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి లో మరాఠీ కుటుంబానికి చెందిన రాజేశ్వరి.రెండురోజుల క్రితం పూల కోసం ఇంటి నుంచి బయటకి వచ్చి మిస్సింగ్.3 వ పట్టణ పోలీస్ లు కేసు నమోదు.నేడు బస్ స్టాండ్ సమీపం లోని ఇడ్లి అండ్ మోర్ హోటల్ ఎదురుగా ఉన్న షాప్ ల వెనుక వైపు రాజేశ్వరి శవం.రాజేశ్వరి ని ఎవరైనా హత్య చేశారా లేక రాజేశ్వరి ఆత్మహత్య కి పాల్పడిందా అనేకోణం లో పోలీస్ ల విచారణ.బాడీ ని PM నిమిత్తం ఆసుపత్రి మార్చురీకి తరలింపు.