శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం స్వర్ణముఖి దివ్యక్షేత్రంలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంతి కె.చంద్రశేఖర్‌రావు, ఆయన సతీమణి శోభ దంపతులు చేయూతనిచ్చారు. ఆలయం ముందు భాగంలో మహారాజ గోపురం, తూర్పు మాడవీధి నిర్మాణానికి విరాళమిచ్చారు. శనివారం ఆలయంలో శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకం, ఇతర పూజా కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు పాల్గొనాల్సి ఉండగా కొవిడ్ నిబంధనల దృష్ట్యా హాజరు కాలేదు. ఆలయ నిర్వాహకులు ఆయన పేరిట శిలాఫలకం ఆవిష్కరించారు.
నెల్లూరు ఆలయానికి కేసీఆర్ విరాళం

Related tags :