ఈ సీజన్లో తన జోరును కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఐదోసారి ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. శనివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ బ్రిటన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 41.252 సెకన్లలో ముగించాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్ సహచరుడు, మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆరు రేసులు జరగ్గా… నాలుగింటిలో హామిల్టన్ విజయం సాధించాడు. బొటాస్ (మెర్సిడెస్), వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) ఒక్కో విజయాన్ని అందుకున్నారు. నేటి సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు మొదలయ్యే బెల్జియం గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
లూయిస్ హామిల్టన్‌కు తొలిస్థానం
Related tags :