ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్జీకి ఇప్పటికే పలు స్మార్ట్‌ఫోన్‌లను కూడా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కొత్త మొబైల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సమాయత్తమైంది. ఎల్జీ ‘వింగ్’ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. దీని ధర దాదాపు వెయ్యి డాలర్లు (మన కరెన్సీలో దాదాపు రూ.75వేలు) ఉండొచ్చని టెక్ నిపుణులు పేర్కొన్నారు. అయితే యూఎస్‌లో తొలుత విడుదల కానుండగా.. భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనేది సంస్థ ప్రకటించలేదు. ఎల్జీ ‘వింగ్’ ఫోన్‌కు సంబంధించి వచ్చిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. గెలాక్సీ ఫోల్డ్, జీ ఫ్లిప్, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యూ ధర దాదాపు రూ.లక్ష కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఎల్జీ వింగ్ రూ.75 వేలతో మార్కెట్లోకి వస్తే వినియోగదారులు అటువైపు మొగ్గే అవకాశం ఉందని సంస్థ భావిస్తోంది. అయితే లోయర్‌ఎండ్ స్నాప్‌డ్రాగన్ 765G ప్రాసెసర్‌తో రానుంది. అయితే ధర తక్కువగా ఉండటం కలిసొచ్చినా.. ప్రాసెసర్ విషయంలో వినియోగదారుడు ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే. ‘వింగ్’ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఫీచర్లు ఏముంటాయనేది ఎల్జీ సంస్థ అధికారికంగా ఇంకా వెల్లడించలేదు.
LG వింగ్ వచ్చేసింది
Related tags :