గ్రామాల్లో చాలా మంది రైతులు వ్యవసాయం చేయడంతో పాటు పాలను అమ్ముతారు. అలా వచ్చిన డబ్బుతో పంట చేతికొచ్చేదాకా ఖర్చులను వెళ్లదీస్తారు. కానీ ఆ గ్రామంలో మాత్రం పాలను అసలే అమ్మరు. ఎవరికైనా అవసరముందంటే ఊరికేనే పోస్తారు. ఆ గ్రామం పేరు యెలేగావ్ గావాలీ. ఈ గ్రామం మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో ఉన్నది. ఈ ఊర్లోవాళ్లంతా తమను తాము శ్రీకృష్ణుడి వారసులం అని భావిస్తారు. అందుకే పాలను అమ్మరు. ఇండ్లలో పాలు మిగిలిపోతే వెన్న, నెయ్యి లాంటివి తయారు చేసుకుంటారు. కానీ పాలను మాత్రం అమ్మరు. తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.
ఆ ఊళ్లో పాలు అమ్మరు
Related tags :