Editorials

ఆకాశంలో అమెరికా-రష్యా అణు సంగ్రామం

USA - Russia Nuclear Fighter Jets Create Tension In Sky

అణు మహా శక్తులైన రష్యా, అమెరికాల సైన్యాల మధ్య ఇటీవల ఘర్షణ వాతావరణం పెరిగిపోయింది. వారం వ్యవధిలోనే ఈ రెండు దళాలు రెండు సార్లు ముఖాముఖీ తలపడ్డాయి. ఈ రెండు సార్లు రష్యా దళాలు దూకుడుగా అమెరికాకు చెందిన వాహనాలు, విమానాలపైకి వెళ్లాయి. వీటిల్లో ఒకసారి నేరుగా రష్యా వాహనాలు అమెరికా సాయుధ వాహనానలను ఢీకొన్నాయి కూడా. ఓ పక్క అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇవి చోటు చేసుకోవడం గమనార్హం.