కండ్లద్దాలపై కరోనా వైరస్ 9 రోజుల వరకు ఉంటుందని, బయటకు వెళ్లి వచ్చినప్పుడు వాటిని కచ్చితంగా శుభ్రం చేయాలని వైద్య నిపుణులు చెప్తున్నారు.
‘మాస్కులతో నోరు, ముక్కును కవర్ చేసుకున్నట్లుగానే కండ్లను కవర్ చేయడానికి అద్దాలు అంతే అవసరం.
కండ్లద్దాలపై వైరస్ 9 రోజుల వరకు ఉంటుందని పరిశోధనల్లో తేలింది.
అందుకే వాటిని తరచూ శుభ్రం చేసుకోవాలి’ అని హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ దవాఖానలోని కంటి వైద్య నిపుణుడు అక్షయ్ చెప్పారు.
అయితే కండ్లద్దాలను ఆల్కహాల్ శానిటైజర్లతో శుభ్రం చేయవద్దని, హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడితే మంచిదని సూచించారు.