ScienceAndTech

దుర్గ ఫ్లైఓవర్‌కు దేశవ్యాప్త ప్రచారం

దుర్గ ఫ్లైఓవర్‌కు దేశవ్యాప్త ప్రచారం

దుర్గా ఫ్లైఓవర్‌ను దేశమంతా చూపించేందుకు కేంద్రం నిర్ణయం

రెండు రోజుల ముందు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ కూడా డ్రోన్‌ వీడియోలు తీయించారు.

★ దేశంలోనే అతి పొడవైన కనకదుర్గా ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవానికి కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయింది.

★ ఇందుకు సన్నాహక ఏర్పాట్లకు ఆదివారం అడుగులు పడ్డాయి.

★ దేశంలోనే అత్యద్భుత ఫ్లై ఓవర్‌ కావటంతో ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది.

★ సెప్టెంబరు 4వ తేదీన వర్చువల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఈ ఫ్లై ఓవర్‌ ఇంజనీరింగ్‌ అద్భుతాన్ని పరిచయం చేయాలని కేంద్రం నిర్ణయించింది.

★ దీని కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా డ్రోన్‌ బృందాన్ని విజయవాడకు పంపించింది.

★ ఈ బృందం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఫ్లైఓవర్‌ అందాలను చిత్రీకరించింది.

★ చిత్రీకరణలో ఆర్‌అండ్‌బీ స్టేట్‌ హైవేస్‌ విభాగం అధికారులతో పాటు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్టు) అధికారులు కూడా పాల్గొన్నారు.

★ సెప్టెంబరు 4వ తేదీన ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా జాతీయ మీడియాలో ఫ్లైఓవర్‌కు సంబంధించిన డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు. 

★ స్పైన్‌ అండ్‌ వింగ్స్‌  టెక్నాలజీతో ఒంటి స్తంభంపై ఆరు వరసలతో నిర్మించిన ఫ్లై  ఓవర్‌ కావటం చేత దీనికి  ప్రాధాన్యత  ఏర్పడింది.

★ దేశంలో ఢిల్లీ, ముంబయిల్లో ఈ తరహా ఫ్లై ఓవర్లు ఉన్నాయి. ఇది మూడవది! 

★ అయినప్పటికీ.. ఆ రెండింటి కంటే అడ్వాన్స్‌ టెక్నాలజీ కలిగి ఉంది. పైగా దేశంలోనే అతి పొడవైనది.

★ ఈ టెక్నాలజీలో వై పిల్లర్స్‌  ఉండటం, వీటి నిడివి ఎక్కువగా ఉండటం కూడా ప్రత్యేకమని  చెప్పుకోవాలి.

★ ఈ టెక్నాలజీలో దేశంలోని అతి పొడవైన ఆరు వరసల ఫ్లై ఓవర్‌ కావటంతో దేశానికి గర్వకారణమైన విషయంగా  కేంద్రం భావిస్తోంది.

★ రెండు రోజుల ముందు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ కూడా డ్రోన్‌ వీడియోలు తీయించారు.

★ ప్రస్తుతం కేంద్ర బృందం అడ్వాన్స్‌ టెక్నాలజీతో ఈ వీడియోలను చిత్రీకరించినట్టు తెలుస్తోంది.