ప్రస్తుతం ఏకాంత జీవితంలోని మధురానుభూతుల్ని ఆస్వాదిస్తున్నానని అంటోంది కథానాయిక కత్రినాకైఫ్. విఫల ప్రేమాయణాల్ని తల్చుకుంటూ విచారపడటం కంటే ఆ అనుభవాల్ని పాఠాలుగా మలుచుకుంటూ జీవితంలో పరిణితిని సాధించడం ముఖ్యమని చెబుతోంది. కెరీర్ తొలినాళ్లలో సల్మాన్‌ఖాన్‌తో ప్రేమాయణాన్ని సాగించింది కత్రినాకైఫ్. మనస్పర్థలతో కొద్ది రోజుల్లోనే ఆ ప్రేమకు ముగింపు పడింది. తర్వాత రణ్‌భీర్‌కపూర్‌లో రిలేషన్‌ఫిప్ సైతం అనుకోని కారణాల వల్ల అర్థాంతరంగా ముగిసిపోయింది. ఈ విఫల ప్రేమాయణాల గురించి కత్రినాకైఫ్ మాట్లాడుతూ ‘జీవితం ఎన్నో ఒడిదుడుకులతో సాగుతుంటుంది. పగ, ప్రతీకారాలతో దానిని మరింత కఠినంగా మార్చుకోవద్దనేది నా సిద్ధాంతం. విఫలప్రేమాయణాలు మిగిల్చిన బాధల్ని జీవిత ప్రయాణంలో మజిలీలుగానే భావించాను. అక్కడితోనే జీవితం ముగిసిపోయిందని ఎప్పుడూ అనుకోలేదు. ఆ అనుభవాలే నాలో వ్యక్తిత్వపరంగా ఎంతో పరిణితిని తీసుకొచ్చాయి. నా ఆలోచనాధోరణిని పూర్తిగా మార్చివేశాయి. ప్రేమికులుగా విడిపోయినా వ్యక్తులుగా మాకు పరస్పరం గౌరవభావముంది. ఎలాంటి ద్వేషం లేదు’ అని తెలిపింది.
మాజీల గోలపై కత్రిన ప్రవచనం
Related tags :