రాష్ట్రంలో అభివృద్ధి సన్నగిల్లిందని.. ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులు పెరిగాయని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. హిందూపురంలో ప్రభుత్వ ఆస్పత్రికి రూ.55లక్షల విలువైన కరోనా నివారణ ఔషధాలు, పరికరాలను అందజేశారు. అనంతరం మీడియాతో బాలకృష్ణ మాట్లాడారు. తాను ఎక్కడున్నా నియోజకవర్గ అభివృద్ధికి శ్రమిస్తానని చెప్పారు. హిందూపురం అభివృద్ధిపై చర్చించేందుకు సీఎం జగన్‌ను ఇప్పటికే రెండుసార్లు అపాయింట్‌మెంట్ కోరానని.. మరోసారి సమయం అడిగి సీఎంను కలుస్తానని తెలిపారు.
మూడోసారి జగన్ కోసం బాలకృష్ణ విన్నపం
Related tags :