కరోనా వైరస్ కారణంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన చైనా.. ఆహార సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు జి జిన్‌పింగ్ వెల్లడించారు. ఈ క్రమంలో 2013 నాటి ‘క్లీన్ యువర్ ప్లేట్’ కార్యక్రమాన్ని మరోసారి ప్రారంభించారు. ప్రజలు ఖర్చులను తగ్గించుకోవాలని ఆయన సూచించారు. అయితే ఈ కార్యక్రమానికి, లద్దాఖ్, దక్షిణ సముద్రంలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధం ఉందంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వ చర్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసమే డ్రాగన్ సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వేలా ప్రవర్తిస్తూ.. ఉద్రిక్తతలను పెంచుంతుందంటున్నారు విశ్లేషకులు. గతంలో మావో జెడాంగ్ కూడా ఇలానే చేశారని గుర్తు చేసుకుంటున్నారు. 1962లో ఆహార వృథాని అరికట్టడానికి మావో ‘గ్రేట్ లీఫ్ పార్వర్డ్ మూమెంట్’ని ప్రారంభించాడు. ఫలితంగా కోట్ల మంది చైనీయులు ఆకలితో చనిపోయారు. అయితే ఈ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికే కాక.. ప్రపంచ దేశాలతో పాటు స్వంత ప్రజల దృష్టిని మరల్చడానికి 1962లో భారత్‌తో సరిహద్దు వివాదాన్ని ముందుకు తెచ్చాడని.. ప్రస్తుతం జిన్‌పింగ్ కూడా అదే పద్దతిని అనుసరిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆకలితో అలమటిస్తున్న చైనీయులు
Related tags :