* జడ్జి రామకృష్ణ ఇంటి ఎదుటి రోడ్డుపై తహశీల్దార్ నోటీసులు..తహశీల్దార్ నోటీసులను సవాల్ చేస్తూ జడ్జి రామకృష్ణ పిటిషన్..తహసీల్దార్ నోటీసులను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన హైకోర్టు.10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం..తదుపరి విచారణ పది రోజులకు వాయిదా వేసిన హైకోర్టు.
* ఏపీ డీజీపీ కి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లేఖగత ఏడాది కాలంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి,దారుణమైన స్థితికి చేరాయి. దోపిడిదారులు, గుండాలు, మాఫియా శక్తులన్నీ ఏకమై ఆంధ్రప్రదేశ్ ను ఆటవిక రాజ్యంగా మార్చారు.బడుగు బలహీన వర్గాల వారిపై గంపగుత్త దాడులే కాదు, విచ్చలవిడిగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడటం,రాజ్యాంగం ఇచ్చిన ప్రాధమిక హక్కులను కాలరాయడం ద్వారా మొత్తం ప్రజాస్వామ్యాన్నే ప్రమాదంలోకి నెట్టారు.మీడియాపై వరుస దాడులు చేస్తున్నారు.
* సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. రాష్టవ్యాప్తంగా ఉద్యోగ సంఘాల నిరసనలు మారుమోగాయి.ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
* గల్లంతయిన రిపోర్టర్ రాజు మృతదేహం లభ్యం.నిన్న తెనాలి వద్ద గల్లంతైన రిపోర్టర్ రాజు మృతదేహం ఈ రోజు NDRf , ఫైర్ వాళ్ళు మృతదేహానికి వెలికితీశారు.నిన్న రాత్రి నుండి గుంటూరు జిల్లా కార్యదర్శి శివ అధికారులతో, NDRF, ఫైర్ సిబ్బంది తో సమన్వయం చేస్తూ..మృతదేhaM ఆచూకీ కోసం ప్రయత్నాలు చేశారు.ఎట్టకేలకు ఈ రోజ్ 10.55 కి మృతదేహం ఆచూకీ లభించింది.
* విశాఖ డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర కోణం ఉందన్న సీబీఐ.కుట్ర కోణం గురించి లోతుగా దర్యాప్తు చేయటానికి మరికొంత సమయం కావాలని కోరిన సీబీఐ.రెండు నెలలు సమయం ఇచ్చిన హైకోర్టు.నవంబర్ 11 నాటికి తుది నివేదికను సమర్పించాలని తెలియజేసిన ధర్మాసనం.తదుపరి విచారణ నవంబర్ 16 కు వాయిదా వేసిన ధర్మాసనం.
* మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు యత్నం..లొంగిపోయేందుకు చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం..కుటుంబ సభ్యులతో మంతనాలు జరుపుతున్న గణపతి..మావోయిస్టు కేంద్ర కార్యదర్శిగా పని చేసిన గణపతి ..ఎంపీసీ, నక్సలైట్ పార్టీల విలీనం తర్వాత కేంద్ర కార్యదర్శిగా పనిచేసిన గణపతి..సుదీర్ఘకాలంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శిగా పనిచేసిన గణపతి.2018 లో కేంద్ర కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్న గణపతి..అనారోగ్య కారణాలతో కేంద్ర కార్యదర్శి పదవి వదులుకున్న గణపతి..గణపతి తర్వాత కేంద్ర కార్యదర్శి పదవిని చేపట్టిన నంబాల కేశవరావు..అనారోగ్య సమస్యలతో సతమవుతున్న గణపతి..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి రాగానే లొంగుబాటు సిద్ధం.74 ఏళ్ల వయసు వయసులో తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న గణపతి.