దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 82వేల 748మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి మొత్తంగా 1,50,059 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఆరో తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. మొదటి రోజు ఆర్కిటెక్చర్, ప్లానింగ్ పరీక్ష ఉండగా.. రెండో తేదీ నుంచి బీటెక్, బీఈ పరీక్ష ఉంటుంది. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సాయంత్రం 3గంటల నుంచి 6గంటల వరకు ఇలా రెండు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తారు. కొవిడ్ లక్షణాలున్న విద్యార్థుల కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. వీటిల్లోని పర్యవేక్షకులకు పీపీఈ కిట్లు ఇవ్వనున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు అందరికీ థర్మల్‌స్క్రీనింగ్ చేస్తారు.
ప్రారంభమయిన JEE-MAIN పరీక్షలు
Related tags :