Food

మాంసంతో పోటీపడే ఆకుకూరలు

మాంసంతో పోటీపడే ఆకుకూరలు

నాన్ వెజ్ ఆహారాన్ని చాలామంది బలాన్ని ఇస్తుందని అనుకుంటారు. ఆ సంగతి ప్రక్కన పెడితే వాటికి సమానంగా ఆకు కూరలు కూడా బలాన్ని అందిస్తాయి. రోజువారీగా ఒక కప్పు ఆకుకూర ఆహారంతో కలిపి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు. ఏయే ఆకుకూరల నుంచి ఎలాంటి శక్తి లభిస్తుందో చూద్దాం.
*తోటకూరలో 50 కేలరీల శక్తి లభిస్తుంది. బీ1, బీ2 విటమిన్లు కలిగివుండే తోటకూర కంటిచూపుకు చాలామంచిది.
*బచ్చలికూరలో 66 శాతం ఇనుము ఉంటుంది. శరీరానికి చలువను, శక్తిని ఈ కూర అందిస్తుంది. మొలలు వంటి వ్యాధులను అరికడుతుంది.
* అవిశ కూర ద్వారా లభించే ఐరన్ గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తుంది. మూత్రాశయంలో ఏర్పడే రాళ్ళను కరిగించే శక్తి ఈ ఆకుకూరకు ఉంది.
*పుదీనా ఆకు నోటి దుర్వాసనను, నోటిలోని పుండ్లను నివారిస్తుంది. దీని వాసనకు క్రిములు దూరమవుతాయి.
*కొత్తిమీర రక్తవృద్ధిని, జీర్ణవృద్ధిని ఆకలిని పెంచుతుంది. కరివేపాకు క్యాన్సర్‌ను నెరవేరుస్తుంది.
*ఇక గోంగూర దగ్గు, ఆయాసం, తుమ్ముల బాధకు మందులా పనిచేస్తుంది. కాల్షియం లభ్యమై రక్తహీనతను పోగొడుతుంది.
* పొన్నంగంటికూర రక్తాన్ని శుభ్రపరచటమే కాకుండా శరీరానికి చలువనిస్తుంది. గుండెకు మంచిది. బి, సి విటమిన్‌లు ఎక్కువగా ఉంటాయి. జీర్ణశక్తిని పెంచుతుంది. మూత్రవ్యాధులను నివారిస్తుంది.
*పాలకూర ఎ, సి విటమిన్‌లు ఉన్నాయి. ఇనుము, కాల్షియం లోపాలు లేకుండా పిల్లల పెరుగుదలకు తోడ్పడుతుంది.