DailyDose

మరో ఏపీ మంత్రికి కరోనా-TNI బులెటిన్

మరో ఏపీ మంత్రికి కరోనా-TNI బులెటిన్

* తెలంగాణ కొరొనా హెల్త్ బులిటెన్ విడుదల.గడిచిన 24 గంటల్లో 2734 కొరొనా పాజిటివ్ కేసులు నమోదు.మొత్తం ఇప్పటి రాష్ట్రంలో 1 27 697 కొరొనా కేసులు నమోదు.కొత్తగా 9 మరణాలు 836 కి చేరిన మరణాల సంఖ్య.మొత్తం ఆక్టీవ్ కేసులు 31 699 కొరొనా కేసులు.గడిచిన 24 గంటల్లో 38 351 శాంపిల్స్ కలెక్ట్ చేయగా 878 పెండింగ్ లో ఉన్నాయి.ఘంఛ్- 347, భద్రాద్రి- 117, కరీంనగర్- 106, ఖమ్మం 161, మేడ్చెల్- 121, నల్గొండ- 191, నిజామాబాద్- 114, రంగారెడ్డి- 212, సిద్దిపేట- 109, సూర్యాపేట- 107, వరంగల్ అర్బన్- 112 కేసులు నమోదు.ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ 24 598 ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడి.

* విజయనగరంజిల్లా వైద్య ఆరోగ్య పర్యవేక్షణాధికారి లక్ష్మునాయుడు కరోనాతో మృతి.గత పదిహేను రోజులుగా కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందిన లక్ష్మునాయుడు. పరిస్థితి విషమించడంతో మృతి.లక్ష్మునాయుడు మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన సిబ్బంది.

* మండలి చైర్మన్ షరీఫ్‌కు కరోనా పాజిటివ్.ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.సామాన్య ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు.ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలకు కరోనా సోకగా…తాజాగా మండలి చైర్మన్‌ షరీఫ్‌కు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది.ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.షరీఫ్‌ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు ఆకాంక్షించారు. 

* ఆంధ్రప్రదేశ్‌‌లో మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కరోనా సోకింది. రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసులు లక్షకు చేరువయ్యాయి. రోజూ పదివేల వరకూ కొత్త కేసులు వెలుగు చూస్తుండటంతో ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ప్రస్తుతం 13 జిల్లాల్లో కలిపి 99,129 మంది కొవిడ్‌కు చికిత్స పొందుతున్నారు.