కొన్ని దేశాల వింత ఆచారాలు ఆశ్చర్యపరుస్తుంటాయి. జపాన్లో జరిగే ఓ పండగ కూడా అంతే. ఎక్కడైనా కార్చిచ్చులు చెలరేగి కొండలు తగలబడితే దాన్ని ఎలా ఆపాలా అని చూస్తారు. కానీ జపాన్లోని ‘వకాకుసయామా’ అనే కొండను మాత్రం ప్రజలే కావాలని తగలబెడతారు. ఎందుకంటే అక్కడ ఇదో పెద్ద పండగ! ఏటా జనవరిలో నాలుగో శనివారం రోజున ఇలా కొండను తగలబెట్టే పండగ జరుగుతుంది. దీనికి ‘వకాకుస యమమాకి’ అని పేరు. ఈ కొండ కిందన మూడు ఆలయాలు ఉన్నాయి. పండగ రోజున ఆ దేవతలకు పూజలు జరుగుతాయి. ఆ తర్వాత భారీగా మందుగుండు పేలుస్తారు. అప్పుడు పూజారులు కొండ దిగువ భాగంలో మంటపెడతారు. దాంతో అరగంటలోనే మొత్తం అంతా తగలబడుతుంది. ఆ మంటలు ఊరు మొత్తం కనిపిస్తాయట. వందల ఏళ్ల నుంచీ ఈ పండగ చేస్తున్నారట. దీని వల్ల స్థానిక ప్రజలకు మంచి జరుగుతుందనీ, పంటలు బాగా పండుతాయనీ నమ్ముతారు.
వకాకుస యమమాకి
Related tags :