* మద్యం పై ఏపీ హైకోర్టు కీలక తీర్పుఇతర రాష్ట్రాల నుండి మద్యం ని తీసుకుని వచ్చే వ్యక్తులకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పుజీవో నెంబర్ 411 ప్రకారం మద్యాన్ని తీసుకుని వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ; హైకోర్టులో దాఖలైన టువంటి వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనందీనిపై కీలక తీర్పు వెలువరించింది,ఈ తీర్పు ప్రకారం ఎవరైనా నా ఇతర రాష్ట్రాల నుండి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చని హైకోర్టు తీర్పుఈ తీర్పుతో మద్యం ప్రియులకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నుండి ఉపశమనం కలిగినట్లు అయింది.
* దేశద్రోహ ఆరోపణలతో జైలుశిక్ష అనుభవిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ వైద్యుడు డా.కఫీల్ ఖాన్.. అలహాబాద్ హైకోర్టు తీర్పుతో ఎట్టకేలకు విడుదలయ్యారు. బుధవారం అర్ధరాత్రి విడుదలైన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ నా ప్రసంగంలో హింస, విద్వేషాలను రెచ్చగొట్టే అంశాలేవీ లేవని కోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానం తీర్పుకు ధన్యవాదాలు. అలాగే నన్ను ముంబై నుంచి మథురకు తీసుకొచ్చిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. మార్గమధ్యలోనే నన్ను ఎన్‌కౌంటర్ చేయకుండా జైలుకు తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు.’’ అని కఫీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తనను ఇంకో కేసులో ఇరికించాలని చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
* వైద్యుల నిర్లక్ష్యంతో సిజేరియన్ శస్త్రచికిత్స వికటించి బాలింత మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎస్సార్‌నగర్ ఠాణాలో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్ నర్సింహారెడ్డి వివరాల ప్రకారం.. గాయత్రిహిల్స్‌లోని నవభారత్‌నగర్‌కు చెందిన ఎం.జానకి(23)కి పురిటినొప్పులు ఎక్కువవడంతో కుటుంబ సభ్యులు ఈ నెల 28న ఉదయం శ్రీరామ్‌నగర్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకువచ్చారు. 29న అర్ధరాత్రి 2.30 గంటలకు ఆసుపత్రిలోని వైద్యురాలు, మరో నర్సు, ఇతర సిబ్బంది సిజేరియన్ చేయగా మగబిడ్డ పుట్టాడు. ఆ తరువాత జానకి ఆరోగ్యం విషమించడంతో తెల్లవారుజామున 4.30 గంటలకు నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 30న ఉదయం ఆమె మృతి చెందింది. శస్త్రచికిత్స చేసిన సమయంలో ఓ నర్సు, మరో వైద్యురాలు వీడియో కాల్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దీంతో ఆపరేషన్ వికటించి జానకి మృతి చెందిందని ఆరోపిస్తూ.. ఆమె కుటుంబ సభ్యులు ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిర్లక్ష్యం కింద వైద్య సిబ్బందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఇన్‌స్పెక్టర్ చెప్పారు. ఈ విషయమై వైద్యాధికారులను సంప్రదించేందుకు యత్నించగా అందుబాటులోకి రాలేదు.
* అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రభుత్వ నిధులను కాజేసిన నిందితులను పోలీసు ప్రత్యేక బృందాలు అరెస్టు చేశాయి. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్, బస్తి ప్రాంతాల్లో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని గువాహటికి తరలించారు. ముఖ్యమంత్రి సహాయనిధిలో అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన సీఎం కార్యాలయ అధికారులు.. విచారణ చేపట్టి నిందితులను 15 రోజుల్లోగా అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి ప్రత్యేక విజిలెన్స్ సెల్‌ను ఆదేశించారు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సెల్ పోలీసు సూపరింటెండెంట్ రోసీ కలీత ఆగస్టు 12న కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు అనాధారిత చెక్కుల ద్వారా హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు బ్యాంకుల్లో డబ్బు విత్‌డ్రా చేసినట్లు గుర్తించారు.
* ఖమ్మం నగరంలోని ఒకటో డివిజన్ కైకొండాయగూడెంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 18న తేజ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యువకుడి మృతికి స్థానిక కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్ కారణమని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన నిర్వహించారు. అదే సమయంలో కార్పొరేటర్ కైకొండాయగూడెం రావడంతో బాధిత కుటుంబ సభ్యులు కార్పొరేటర్ వాహనాన్ని ధ్వంసం చేసి దాడికి పాల్పడ్డారు. దీంతో కార్పొరేటర్ అక్కడే ఉన్న పాఠశాలలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రామ్మూర్తి నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలిస్తుండగా బంధువులు అడ్డుకుని నిప్పు పెట్టారు. దీంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఏసీపీ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కారులను పోలీసులు చెదరగొట్టారు.