* తెలంగాణ పరిధిలోని శ్రీశైలం జలాశయం ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాద ఘటన కలకలం సృష్టించింది. విద్యుత్ కేంద్రంలోకి సామగ్రిని తీసుకెళ్తున్న డీసీఎం వ్యాను.. పక్కనే ఉన్న విద్యుత్ కేబుళ్ల పైనుంచి వెళ్లడంతో షార్ట్‌సర్క్యూట్‌లా రావడంతో దాదాపు 10మిటర్ల చొప్పున మంటలు ఎగసిపడ్డాయి. ఇటీవల జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకున్న అక్కడి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వార్తలు ఒక్కసారిగా గుప్పుమనడంతో జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు స్పందించారు. ఇది ప్రమాదం కాదని, ఇటీవల జరిగిన భారీ ప్రమాదంతో పునరుద్ధరణ పనులు జరుగుతున్న వేళ ఈ కేంద్రంలో మాక్ డ్రిల్ నిర్వహించినట్టు స్పష్టంచేశారు. మరోసారి అగ్నిప్రమాదం జరిగితే ఎలా స్పందిస్తారోనని మాక్‌డ్రిల్ నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. చివరకు ఇది.. మాక్ డ్రిల్ అని తెలియడంతో సిబ్బంది, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
* విజయవాడ చేరుకున్న చంద్రబాబు.అచ్చంనాయుడుని పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు.దాదాపు 80 రోజులు ఈఎస్ఐ స్కాములో రిమాండ్ లో ఉన్న అచ్చంనాయుడు. కరోనా బారినపడి కోలుకున్న అనంతరం ఇంటికి చేరుకున్న అచ్చంనాయుడు.అచ్చంనాయుడు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు. అచ్చంనాయుడు పరామర్శించిన అనంతరం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లనున్న చంద్రబాబు.
* దివంగత ముఖ్యమంత్రి జయలలిత తమిళనాటే కాకుండా దేశవ్యాప్తంగా పేరుగాంచిన సినీ, రాజకీయ నాయకురాలు. తమిళనాడులో ‘అమ్మ’ అంటే ఆమే గుర్తుకొస్తుంది. అభిమానులు తమ పిల్లలకు, దుకాణాలకు ఆమె పేరే పెట్టుకుంటారు. తమిళనాడులో ‘అమ్మ ఇడ్లీ’ కూడా ఎంతో ఫేమస్. జయలలిత సీఎంగా ఉన్నప్పుడు పేదల కోసం ఒక్కరూపాయికే ‘అమ్మ ఇడ్లీ’ పథకం ప్రవేశపెట్టారు. ప్రస్తుత కాలంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఇప్పటి వరకు పార్టీ పరంగా భాజపా దక్షిణాదిలో పెద్ద ప్రభావం చూపకపోయినా.. మోదీకి అభిమానులు భారీగా ఉన్నారు. తమిళనాడుకు చెందిన ఓ భాజపా నేత ఏకంగా మోదీ పేరు మీద అల్పాహారాన్ని పేదలకు అందించేందుకు ఓ వినూత్న కార్యక్రమం చేపట్టాడు. అదే ‘మోదీ ఇడ్లీ’.. ఇదేదో ‘అమ్మ ఇడ్లీ’కి పోటీ అనుకుంటున్నారా.. మరి ‘మోదీ ఇడ్లీ’కి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దామా…!
* వైకాపాలో వర్గ పోరు వైఎస్‌ఆర్ వర్ధంతి వేదికగా మరోసారి బహిర్గతమైంది. ప్రకాశం జిల్లా చీరాలలో ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వర్గీయులు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు.ఫ్లెక్సీలు కూడా ఎవరికి వారే కట్టారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద కార్యక్రమానికి ఎమ్మెల్యే కరణం బలరాం వర్గీయులకు ఉదయం సమయమిచ్చారు. ఆ తర్వాత ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులకు అవకాశమిచ్చారు. తొలుత విగ్రహానికి ఏఎంసీ ఛైర్మన్, కార్యకర్తలు నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే వేణుగోపాల్ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
* మోదీ ప్రభుత్వ విధానాలను తరచూ విమర్శిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా వాటిలో పదును పెంచారు. చైనాతో ఘర్షణలు, కుంగిన వృద్ధిరేటు, పెరిగిన నిరుద్యోగిత వంటి అంశాల్ని ప్రస్తావిస్తూ భాజపా ప్రభుత్వంపై విరచుకుపడ్డారు. ‘మోదీ వల్ల సంభవించిన ఈ విపత్తుల్లో భారత్ చిక్కుకుంది’ అంటూ ఐదు అంశాల్ని ప్రస్తావించారు. వృద్ధి రేటులో కుంగుబాటు, 45 ఏళ్ల గరిష్ఠానికి చేరిన నిరుద్యోగిత, 12 కోట్ల ఉద్యోగాల కోత, రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ ఆదాయాన్ని నిలిపివేయడం, కరోనాతో ప్రపంచంలోనే అత్యధిక మంది మరణించడం, సరిహద్దుల్లో పొరుగు దేశాల అతిక్రమణ వంటివి మోదీ వల్ల సంభవించిన విపత్తులంటూ రాహుల్ విమర్శించారు.
* కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి సదానంద గౌడతో హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణకు కేటాయించిన ఎరువుల సరఫరాపై కిషన్‌రెడ్డి చర్చించారు. ఈ మేరకు సదానందగౌడకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కిషన్‌రెడ్డి కార్యాలయం ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలపై ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రానికి అవసరమైన యూరియాను సరఫరా చేస్తామని సదానందగౌడ హామీ ఇచ్చినట్లు తెలిపింది. 2020 ఖరీఫ్ సీజన్ కోసం తెలంగాణ మొత్తానికి 10 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులకు సంబంధించిన ప్రతిపాదనలు అందినట్లు ఎరువుల మంత్రిత్వశాఖ అధికారులు చెప్పారని పేర్కొంది.
* రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇటీవల కాలంలో దళితుల అనుమానాస్పద మరణాలు, మీడియా ప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయన్నారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను చంద్రబాబు కోరారు. ఈ మేరకు డీజీపీకి ఆయన లేఖ రాశారు. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణమైన స్థితికి చేరాయన్నారు. దోపిడీదారులు, గూండాలు, మాఫియా శక్తులన్నీ ఏకమై ఆంధ్రప్రదేశ్‌ను ఆటవిక రాజ్యంగా మార్చారని మండిపడ్డారు. విచ్చలవిడిగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడటం.. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను కాలరాయడం ద్వారా మొత్తం ప్రజాస్వామ్యాన్నే ప్రమాదంలోకి నెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
* మోదీ ప్రభుత్వ విధానాలను తరచూ విమర్శిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా వాటిలో పదును పెంచారు. ‘మోదీ వల్ల సంభవించిన ఈ విపత్తుల్లో భారత్ చిక్కుకుంది’ అంటూ ఐదు అంశాల్ని ప్రస్తావించారు. వృద్ధి రేటులో కుంగుబాటు, 45 ఏళ్ల గరిష్ఠానికి చేరిన నిరుద్యోగిత, 12 కోట్ల ఉద్యోగాల కోత, రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ ఆదాయాన్ని నిలిపివేయడం, కరోనాతో ప్రపంచంలోనే అత్యధిక మంది మరణించడం, సరిహద్దుల్లో పొరుగు దేశాల అతిక్రమణ వంటివి మోదీ వల్ల సంభవించిన విపత్తులంటూ రాహుల్ విమర్శించారు.
* డెన్మార్క్‌లో వచ్చేనెలలో ప్రారంభంకానున్న థామస్ అండ్ ఉబెర్ కప్ టోర్నీ నుంచి స్టార్‌షట్లర్ పీవీ సింధు వైదొలిగారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి పీవీ రమణ వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతోనే సింధు ఈ టోర్నీకి దూరమైనట్లు సమాచారం. వచ్చేనెల 3 నుంచి 11 వరకు డెన్మార్క్‌లోని అర్హస్‌లో థామస్ అండ్ ఉబెర్ కప్ టోర్నీ జరగనుంది.
* చైనా ఈ దశాబ్దంలో తన అణ్వాయుధ సంపత్తిని రెట్టింపు చేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తోందని అమెరికా సైనిక విభాగం వెల్లడించింది. అందులో అమెరికా వరకూ వెళ్లగలిగేలా రూపొందించిన బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయని పేర్కొంది. కాంగ్రెస్‌కు సమర్పించిన ‘చైనా సైనిక శక్తి’ వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.
* ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఆయనకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, రామగుండం సీపీ సత్యనారాయణ స్వాగతం పలికారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెల రోజుల క్రితం మావోయిస్టుల కదలికలపై డీజీపీ ఆరా తీశారు. హెలీప్యాడ్ వద్దనే అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్కడి నుంచి ఉట్నూరు బయల్దేరి వెళ్లారు. మరోవైపు మహేందర్‌రెడ్డి పర్యటనను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.
* ఐపీఎల్‌ను వదిలిరావడానికి కారణాలేంటో ‘క్రిక్ బజ్’కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో రైనా వివరించాడు. ‘కుటుంబం కోసమే తిరిగి రావాలని నిర్ణయించుకున్నా. వెనువెంటనే నేను దగ్గరుండి చూసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. సీఎస్‌కే కూడా నా కుటుంబమే. గట్టి కారణం లేకుండా ఎవరూ రూ.12.5 కోట్లు వదులుకోరు. అంతర్జాతీయ క్రికెట్‌కు నేను వీడ్కోలు పలికి ఉండొచ్చు. కానీ నాకింకా వయసుంది. మరో నాలుగైదేళ్లు చెన్నైకి ఆడగలను’ అని రైనా అన్నాడు.
* సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇక ఆయన నటిస్తున్న ‘వకీల్‌సాబ్’ చిత్రం నుంచి మోషన్‌పోస్టర్ విడుదల కాగా, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ డ్రామాకు సంబంధించి ప్రీలుక్‌ను విడుదల చేశారు. ఇప్పుడు మరో రెండు సర్‌ప్రైజ్‌లు వచ్చేశాయి.
* భారత్‌లో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా నిత్యం దాదాపు 70వేలకు పైగా ప్రజలు కొవిడ్ బారినపడుతున్నారు. వీరిలో ఎక్కువగా యువకులు, మధ్య వయస్సువారే ఉంటున్నట్లు నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు 54శాతం 18-44 ఏళ్ల వయస్సువారే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక కరోనా మరణాల్లో 51శాతం మంది 60ఏళ్లకు పైబడిన వారు ఉన్నట్లు తెలిపింది.
* కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భాగంగా మోదీ ప్రభుత్వం మార్చి నెలలో పీఎం కేర్స్ నిధిని ఏర్పాటు చేసింది. ప్రభుత్వానికి ఆర్థిక సాయం చేయాలనుకునేవారు ఈ నిధికి విరాళాలు అందించవచ్చని పేర్కొంది. ఈ నిధి ప్రారంభమైన ఐదురోజుల్లోనే రూ.3076 కోట్లు జమ అయ్యాయి. మార్చి 27వ తేదీ నుంచి మార్చి 31 వరకు ఈ మొత్తం(రూ.30,76,62,58,096) చేకూరినట్లు తాజాగా ఆడిట్ నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదికను పీఎం కేర్స్ వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచింది.
* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నవంబరులో అస్వస్థతకు గురయ్యారనే వార్తలు వచ్చాయి. ఆయనకు స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, అందుకే ఆకస్మికంగా ఆసుపత్రిని సందర్శించాల్సి వచ్చిందని అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. అంతేకాకుండా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు ఉపాధ్యక్షుడిగా ఉన్న మైక్ పెన్స్‌ను సంసిద్ధం(స్టాండ్‌బై)గా ఉంచినట్లు కూడా ఓ వార్తా సంస్థ పేర్కొంది. అనంతరం సామాజిక మాధ్యమాల్లోనూ దీనిపై చర్చ జరిగింది.
* కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఒకవైపు ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటే.. పావు శాతం మంది మాత్రం దానిపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదని వెల్లడైంది. 27 దేశాలకు చెందిన 20 వేల మంది వయోజనులపై జరిపిన ఓ ఆన్‌లైన్ సర్వేలో ఈ ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ఈ సర్వేను ప్రపంచ ఆర్థిక వేదిక(ఐఎంఎఫ్) ఆధ్వర్యంలో ప్రముఖ అధ్యయన ఏజెన్సీ ఇప్సోస్ నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా 74% మంది ప్రజలు కొవిడ్ టీకా అందుబాటులో ఉంటే.. దాన్ని వేయించుకునేందుకు సిద్ధమేనని తెలిపారు.