యుఎస్ ఓపెన్‌లో మాజీ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ తొలి అడుగు వేసింది. మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో ఆమె 7-5, 6-3 తేడాతో అమెరికాకే చెందిన క్రిస్టీపై విజయం సాధించింది. మూడో సీడ్ సెరెనాకు తొలి సెట్‌లో ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. తొలి రెండు గేమ్‌లు గెలిచిన క్రిస్టీ 2-0 ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత పుంజుకున్న సెరెనా వరుసగా మూడు గేమ్‌లు గెలిచింది. ఆ తర్వాత క్రిస్టీ మరో గేమ్ గెలవడంతో స్కోరు 3-3తో సమమైంది. అక్కడి నుంచి పోరు మరింత హోరాహోరీగా మారింది. ఆధిపత్యం చేతులు మారుతూ సాగింది. చెరో రెండు గేమ్‌లు గెలవడంతో స్కోరు 5-5తో మరోసారి సమమైంది. ఈ దశలో పూర్తిస్థాయి ఆటతీరుతో చెలరేగిన సెరెనా వరుసగా రెండు గేమ్‌లు గెలిచి సెట్ సొంతం చేసుకుంది. ఇక రెండో సెట్లో దూకుడు కొనసాగించిన ఆమె.. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్‌లో ఆమె 13 ఏస్‌లు, 28 విన్నర్లు కొట్టింది. మరో మ్యాచ్‌లో వీనస్ 3-6, 5-7తో ముచోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడింది. 40 ఏళ్ల వీనస్.. 25 ఏళ్ల ముచోవా జోరు ముందు నిలవలేకపోయింది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఆడిన తొలి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లో క్లియ్‌స్టర్స్ (బెల్జియం) 6-3, 5-7, 1-6తో అలెగ్జాండ్రోవా (రష్యా) చేతిలో పరాజయం పాలైంది. రెండో సీడ్ కెనిన్ (యుఎస్‌ఏ), అయిదో సీడ్ సబాలెంకా (బెలారస్), ఏడో సీడ్ కీస్ (యుఎస్‌ఏ), కొంటా (బ్రిటన్), స్టీఫెన్స్ (యుఎస్‌ఏ), అజరెంకా (బెలారస్) కూడా రెండో రౌండ్ చేరారు.
సెరెనా విజయఢంకా
Related tags :