* సత్తెనపల్లి మై కల్యాణ్ జ్యూవెలర్స్ మేనేజర్ సుభాని ఆత్మహత్య.సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఘటనకు పాల్పడ్డ యువకుడు.సంస్థ ఆర్ధిక లావాదేవిల్లో తేడా రావడంతోనే సూసైడ్ చేసుకుంటునట్లు వీడియోలో వివరణ.వారం రోజుల టైం అడిగిన ఒప్పుకొని యాజమాన్యం.మేనేజర్ సుభాని పై పొలిస్టేషన్ లో ఫిర్యాదు.సంస్థ ఒత్తిడికి తట్టుకోలేక మనస్తాపం చెంది ఆత్మహత్య.దుగ్గిరాల (మం)చిలువూరులో పురుగు మందు తాగి మృతి చెందిన సుభాని.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
* సర్వీస్ రివాల్వర్ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలడంతో ఐపీఎస్ అధికారి మెడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. కర్ణాటక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఆర్పీశర్మ బెంగళూర్‌లోని కోత్నూర్ ప్రాంతంలోని నివాసంలో ఉంటున్నాడు. గురువారం ఉదయం ఇంట్లో సర్వీస్ రివాల్వర్ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలడంతో బుల్లెట్ మెడలోంచి దూసుకెళ్లింది. గాయపడిన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. రివాల్వర్ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలినట్లు శర్మ లిఖితపూర్వకంగా తెలిపారని బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ చెప్పారు. పొరపాటునే గన్ పేలినట్లు దర్యాప్తు బృందానికి సీపీ నివేదిక ఇచ్చారు.
* మానవత్వం మంట కలిసి పోతుంది. దానికి ఇటీవల కాలంలో ఎన్నో సంఘటనలు చూసి ఉంటాం… ఇలాంటి కోవకు చెందిన సంఘటన కడప జిల్లా ముద్దనూరు మండలంలో చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రం కు చెందిన డ్రైవర్ గా పనిచేసే ఒక వ్యక్తిని తన ట్రాన్స్ పోర్ట్ లో సిమెంటు బస్తాలను దొంగలించాడు అనే నెపంతో గుర్రప్ప ట్రాన్స్ పోర్ట్ యజమాని ఆ వ్యక్తిని చెట్టుకు కట్టేసి తన అనుచరులతో విచక్షణారహితంగా కొట్టించాడు.. ఈ సంఘటన అక్కడ ఉన్న స్థానికులకు కంటతడి పెట్టించింది. సదరు డ్రైవర్ తనకు ఏమీ తెలియదని చెబుతున్నా వినకుండా ట్రాన్స్ పోర్ట్ యజమాని చట్టాన్ని ఇలా చేతుల్లోకి తీసుకొని చితకబాదించడం చాలా దారుణం.
* భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యక్తిగత ఖాతాపై ఫేస్‌బుక్ నిషేధం విధించింది.ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వ్యక్తిగత ఖాతాలను తొలగించారు.ద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో రాజాసింగ్ ఫేస్‌బుక్ నియమాలను పాటించలేదని ఫేస్‌బుక్ యాజమాన్యం తెలిపింది. హింసను ప్రేరేపించే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తమ నియమావళిని ఎమ్మెల్యే ఉల్లంఘించారు అని ఫేస్‌బుక్ ప్రతినిధి పేర్కొన్నారు.ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖాతాపై నిషేధం విధించామని స్పష్టం చేశారు.
* ప్రమాదాల్లో ఏపీ వాటా 4.72శాతంఅతివేగం, నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ ఆంధ్రప్రదేశ్‌లో ఏటా వేల మందిని బలి తీసుకుంటోంది.2019లో రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 90.75శాతం, మరణాల్లో 92.68శాతం ఈ రెండు కారణాలవల్లే జరిగాయి.రాష్ట్రంలో సగటున ప్రతి గంటకు 2.36 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా రోజుకు సగటున 21.87 మంది ప్రాణాలు కోల్పోతున్నారు.దేశవ్యాప్తంగా గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏపీ వాటా 4.72శాతం.అత్యధిక ప్రమాదాలు జరిగిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానంలో ఉంది.2018తో పోలిస్తే 2019లో ఏపీలో స్వల్పంగా ప్రమాదాలు తగ్గాయి.నగరాలపరంగా చూస్తే అంతకు ముందేడాదితో పోలిస్తే విజయవాడలో తగ్గుముఖం పట్టగా.. విశాఖపట్నంలో పెరుగుదల నమోదైంది.