* ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం హెల్త్ బులిటెన్ ను ఎంజిఎం వైద్యులు విడుదల చేసారు. తాజాగా ఆయన ఆరోగ్యం మరింత మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఎంజీఎం వైద్యులు తెలిపారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్, ఎక్మో సహాయంతో చికిత్సను అందజేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టు తెలుస్తోంది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కూడా తగ్గినట్టు తెలుస్తోంది.
* కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తిరువూరులో కోవిడ్-19 నిర్దారణ పరీక్షలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయి.
* భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకీ పెరుగుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో నమోదవుతున్న పాజిటివ్ కేసులు.. గత 24గంటల్లోనే అత్యధికంగా 11.70లక్షల శాంపిల్స్‌ను పరీక్షించగా 83,883 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఒకేరోజులో 80వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే ప్రథమం. అంతేకాకుండా ప్రపంచంలో ఏ దేశంలోనూ ఒక్కరోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదుకాలేదు. దీంతో గురువారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 38లక్షల 53వేలకు చేరింది. వీరిలో ఇప్పటికే 29.70లక్షల మందికి పైగా కోలుకోగా.. మరో 8లక్షలకు పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు.
* రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రారంభంలో కాస్త ధీమాగా కనిపించినా ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోతున్నట్టుగా కనిపిస్తోంది.గత నెల రోజుల్లో 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయంటే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.పరీక్షలు విస్తృతంగా నిర్వహించేందుకు ప్రాధాన్యతనివ్వడంతో ఎక్కువ కేసులు నమోదవుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.కానీ నేటికీ అవసరమైన వారికి, ప్రైమరీ కాంటాక్టులకి సకాలంలో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఉంది.దేశంలో మరే రాష్ట్రంలోనే ఇంత వేగంగా కేసులు పెరగటం లేదు.ప్రస్తుతం రాష్ట్రంలో 4,55,531 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 4,125 మంది మృతి చెందారు. 3,48,330 మంది బాధితులు కోలుకున్నారు. 1,03,076 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 38,43,550 కరోనా పరీక్షలు నిర్వహించారు.దేశంలో కరోనా కేసుల ప్రవాహంలో రాష్ట్రం రెండవ స్థానంలోకి వచ్చి చేరింది.