వాములో విరివిగా లభించే పీచు, ఖనిజ లవణాలు, విటమిన్లు, ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సి డెంట్ల వల్ల వ్యాధి నిరోధకత పెరగటంతో పాటు కుంటుబడిన జీవ క్రియలు వేగాన్ని పుంజుకుంటాయి. వాము రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచటంతో పాటు కొవ్వును తగ్గించి, బరువును అదుపు చేస్తుంది. ఇది పేగుల్లోని స్రావాలను పెంచి ఆహారం సులభంగా, వేగంగా కదిలేలా చేసి సత్వరం జీర్ణమయ్యేలా చేస్తుంది. వాముతో ఎసిడిటి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం తదితర సమస్యలు దూరమవుతాయి. వాము పొడి, రాతి ఉప్పును బాగా కలిపి మిశ్రమంగా నూరి రోజు కొంచెం తీసుకుంటే ఎసిడిటి తగ్గుతుంది. – వాము, జీలకర్ర, అల్లం పొడి మిశ్రమాన్ని వాడితే అజీర్తి సమస్యలు దూరమై ఆకలి పుడుతుంది. వాము గింజల్ని దంచి దానిని నిమ్మరసంలో వేసు కుని తాగితే కడుపుబ్బరం, తేన్పులు తగ్గుతాయి. వాము తైలానికి మత్తుని కలిగించే లక్షణంతో పాటు కండరాల్లో సంకోచాన్ని కలిగించే లక్షణం ఉంది. అందుకే హఠాత్తుగా పట్టేసిన కండరాలు తిరిగి పూర్వ స్థితికి రావటానికి ఈ వాము తైలాన్ని వాడుతారు. తుంటి, ఇతర కీళ్ళ నొప్పులున్న వారు ఈ తైలంతో మర్దనా చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి . క్రిములను దూరం చేయటంతో పాటు పలు రకాల ఫంగస్‌లను ఈ తైలం నివారిస్తుంది.విపోటు ఉన్నవారు రెండు చుక్కల వాము తైలం వాడితే తక్షణ ఉపశమనం కలుగుతుంది. వాముకు కఫాన్ని బయటకు పంపే స్వభావంతో పాటు రక్తపోటును తగ్గించే లక్షణం ఉంది. వాము గింజలతో కాచిన కషాయం తాగితే బ్రాంకైటిస్ తగ్గు ముఖం పట్టడమే గాక ఆస్తమా, ఛాతి పట్టేయటం వంటి సమస్యలు ఉపశమనమిస్తాయి. ఓ కప్పు నీటిలో వాము, పసుపు వేసి మరిగించి దాన్ని తేనెతో కలిపి తీసుకుంటే శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు దూరమవు తాయి. మజ్జిగలో వాము పొడి కలుపుకుని తాగినా శ్వాసకోశ సమస్యలు ఉపశమనమిస్తాయి.
కఫాన్ని బయటకు పంపించే వాము
Related tags :