ScienceAndTech

మోడీని హత్య చేస్తామంటూ ఈ-మెయిల్

మోడీని హత్య చేస్తామంటూ ఈ-మెయిల్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామని బెదిరిస్తూ జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కు ఈమెయిల్‌ రావడం కలకలం రేపింది. మోదీకి వచ్చిన బెదిరింపు మెయిల్‌కు సంబంధించిన వివరాలపై ఎన్‌ఐఏ హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసిందని ఓ జాతీయ వార్తా ఛానెల్‌ వెల్లడించింది. ఓ ఈమెయిల్‌ ఐడీ నుంచి ప్రముఖ వ్యక్తులకు వచ్చిన బెదిరింపు కాపీలను హోంశాఖకు పంపిన ఎన్‌ఐఏ వీటిపై తగిన చర్య తీసుకోవాలని ఆ లేఖలో కోరింది. ఆగస్ట్‌ 8న వచ్చిన ఈ బెదిరింపు మెయిల్‌తో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.