మహానటుడు నందమూరి తారక రామారావు, లెజెండరీ డైరెక్టర్ సి.ఎస్.రావు కాంబినేషన్లో పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసాయి. వాటిలో ‘శభాష్ రాముడు’ ఒకటి. ఎన్టీఆర్, దేవిక నాయకానాయికలుగా నటించిన ఈ సినిమాలో… రమణమూర్తి, రేలంగి, కాంతారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, ఆర్.నాగేశ్వరరావు, గిరిజ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. వెంపటి సదాశివబ్రహ్మం కథను అందించగా… రాజశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్‌లాల్ నహతా, టి.అశ్వద్ధనారాయణ సంయుక్తంగా నిర్మించారు. హిందీ చిత్రం ‘బడా భాయి’(1957)కి రీమేక్‌గా ‘శభాష్ రాముడు’ను రూపొందించారు దర్శకుడు సి.ఎస్.రావు. వెంపటి సదాశివబ్రహ్మం, శ్రీశ్రీ, కొసరాజు గీత రచనలో… ఘంటసాల వీనుల విందైన బాణీలను సమకూర్చారు. వాటిలో “జయమ్ము నిశ్చయమ్మురా”(కొసరాజు) “కలకల విరిసిన”(శ్రీశ్రీ) పాటలు ప్రజాదరణ పొందగా… “ఓ చందమామ ఇటు చూడరా”, “జాబిల్లి వెలుగులో”, “ఆశలే అలలాగా”, “ఓ దేవా మొరవినవా” వంటి పాటలు కూడా శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. 1959 సెప్టెంబర్ 4న విడుదలై ఘన విజయం సాధించిన ‘శభాష్ రాముడు’… నేటితో షష్టి పూర్తి చేసుకుంటోంది.
శభాష్ రాముడికి 60ఏళ్లు
Related tags :