భారత్‌లో ఏకే–47 203 మోడల్ రైఫిళ్లను తయారు చేసే విషయమై భారత్–రష్యా మధ్య భారీ ఒప్పందం ఖరారైందని ఓ అధికారి చెప్పారు. ప్రస్తుతం రష్యాలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన సందర్భంగా రెండు దేశాలు ఈ ఒప్పందాన్ని ఖరారు చేశాయి. ఏకే–47 రైఫిల్‌కు అధునాతన వర్షన్ రైఫిల్ ఏకే–47 203 రైఫిల్. అయితే, ఈ ఒప్పందాన్ని ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు. ఏకే-47 203 రైఫిళ్లు అత్యధునికమైన, అధునాతమైనవి. ప్రస్తుతం భారత సైన్యానికి ఈ తరహా రైఫిళ్లు 7.7 లక్షలు అవరసమున్నాయి. ఇందులో లక్షల రైఫిళ్లను దిగుమతి చేసుకోనున్నది. మిగిలినవాటిని దేశీయంగా (భారత్‌లో) తయారు చేయనున్నామని రష్యాకు చెందిన ప్రభుత్వరంగ వార్తా సంస్థ స్పుత్నిక్ వెల్లడించింది.
AK-47…మేడిన్ ఇండియా!
Related tags :