‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను’ అని చాలామంది నటీనటులు అంటుంటారు. అయితే అచ్చ తెలుగమ్మాయి చందన కొప్పిశెట్టి మాత్రం డాక్టర్ అయ్యాక నటి అయ్యారు. డాక్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు పూర్తి చేసిన చందన కథానాయిక కావాలన్న సంకల్పంతో ఇండస్ట్రీకి వచ్చారు. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రం ఆడిషలో విజేతగా నిలిచి కథానాయిక అవకాశాన్ని అందుకున్నారు. సత్యదేవ్ హీరోగా మహా వెంకటేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదౖలది.ఈ సందరగా చందన కొప్పిశెట్టి మాట్లాడుతూ– ‘‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’లో నటనకు బాగా అవకాశం ఉన్న స్వాతి పాత్రను ఇందులో చేశాను. తొలి చిత్రంలోనే అభినయానికి అత్యంత ప్రాముఖ్యం ఉన్న ఇలాంటి పాత్ర లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. హీరోయిన్గా రాణించాలన్న నా ఆశయానికి ఈ చిత్రం బంగారు బాట వేసింది. నా నటనను చూసిన కొందరు సినీ పెద్దలు.. పెద్ద హీరోయిన్ అయ్యే ఫీచర్స్ పుష్కలంగా ఉన్నాయంటూ కితాబు ఇవ్వడం ఎప్పటికీ మరచిపోలేను. ప్రస్తుతం రెండు సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. త్వరలో వాటి వివరాలు చెబుతాను’’ అన్నారు.
టాలీవుడ్‌కు అచ్చ తెలుగుదనం
Related tags :