Politics

చంద్రబాబు కారుకు ప్రమాదం

చంద్రబాబు కారుకు ప్రమాదం

తెదేపా అధినేత చంద్రబాబు కాన్వాయ్‌లోని వాహనం ప్రమాదానికి గురైంది. ఆవు అడ్డురావడంతో ఎస్కార్ట్‌ వాహనం డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. దీంతో కాన్వాయ్‌లోని జామర్‌ వాహనాన్ని ఎన్‌ఎస్‌జీ2 వాహనం ఢీ కొట్టింది. ఆ తర్వాతి వాహనంలోనే ఉన్న చంద్రబాబు క్షేమంగా ఉన్నారు. ఎన్‌ఎస్‌జీ వాహనం మొరాయించడంతో 15 నిమిషాలపాటు ఆయన రోడ్డుపైనే ఆగిపోయారు. అనంతరం స్పేర్‌ వాహనంలో సిబ్బంది ఎక్కారు. విజయవాడ నుంచి చంద్రబాబు హైదరాబాద్‌ వెళ్తుండగా యాదాద్రి భువనగరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.