NRI-NRT

వయోవృద్ధ ప్రవాసుల జాబితా సిద్ధం చేసిన కువైట్

వయోవృద్ధ ప్రవాసుల జాబితా సిద్ధం చేసిన కువైట్

విశ్వ‌విద్యాల‌యం డిగ్రీ లేకుండా 60 ఏళ్లు పైబ‌డిన ప్ర‌వాసులు ప‌ని కోసం త‌మ దేశానికి రాకుండా నిలువ‌రించేందుకు కువైట్ ఓ కొత్త రూల్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా 59 ఏళ్లు పైబడిన వారికి ఇకపై వ‌ర్క్ ప‌ర్మిట్‌ ఒక సంవత్సరానికి మాత్రమే పునరుద్ధరించాలని పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ నిర్ణయించింది. అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం విశ్వవిద్యాలయ డిగ్రీ లేని ప్రవాసులు 60 సంవత్సరాల వయస్సు తర్వాత వారి వ‌ర్క్ ప‌ర్మిట్‌ను పునరుద్ధరించలేరు. ఈ నిబంధ‌న‌ జనవరి 1, 2021 నుండి అమలులో వ‌స్తుంద‌ని కూడా ఇటీవలే ప్రకటించింది. ఇప్పుడు ఈ నిబంధనను అమలు చేసే దిశగా కువైట్ అడుగులేస్తోంది. ఇప్పటికే కువైట్‌లో ఉన్న 60 ఏళ్లకు పైబడిన, విశ్వవిద్యాలయం డిగ్రీ లేని ప్రవాసుల జాబితాను సంబంధిత అధికారులు సిద్ధం చేశారు. ఈ జాబితాలో 68,318 మంది ప్రవాసులు ఉన్నట్లు తాజాగా పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ వెల్లడించింది.