ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విటర్లో తనదైనశైలిలో శుభాకాంక్షలు చెప్పాడు. ‘‘నాలాంటి ‘సున్నా’ విద్యార్థులకు దాని ప్రాముఖ్యత ఏంటో చెప్పారు. ప్రతీ అంకెకూ ఆ సున్నాని జోడిస్తే అదెంత విలువ పెరుగుతుందో వివరించారు. మీలాంటి ఉపాధ్యాయులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే మాజీ బ్యాట్స్మన్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా స్పందించాడు. ‘నాకు చదువు చెప్పిన వాళ్లందరూ లేకపోతే ఇలా ఉండేవాడిని కాదు’ అని పేర్కొన్నాడు.
సున్నాలతో సెహ్వాగ్ శుభాకాంక్షలు

Related tags :