DailyDose

నలుగురిని పొట్టనబెట్టుకున్న మావోలు-నేరవార్తలు

నలుగురిని పొట్టనబెట్టుకున్న మావోలు-నేరవార్తలు

* ఛత్తీస్‌గఢ్‌లో నలుగురు గిరిజనులను మావోయిస్టులు చంపారు. రెండు రోజుల క్రితం బీజాపూర్‌ జిల్లాలోని రెండు గ్రామాలకు చెందిన 26 మంది గిరిజనులను మావోలు అపహరించారు. అనంతరం ప్రజాకోర్టులో నలుగురు గిరిజనులను మావోయిస్టులు చంపారు. ప్రస్తుతం మావోల అదుపులో 16 మంది గిరిజనులు ఉన్నారు.

* గోల్డ్‌ స్మగ్లింగ్‌ కొత్త దారులు తొక్కుతోంది. ఎయిర్‌పోర్టుల్లో కస్టమ్స్‌ కళ్లుగప్పేందుకు వేయాల్సిన వేషాలన్నీ వేస్తున్నారు కేటుగాళ్లు. కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించకుండా అడ్డదారిన సరుకు దాటించేందుకు వేసే ఎత్తులు చూస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సిందే…!  కొందరు బట్టల్లో, మరికొందరు ల్యాప్‌టాప్‌లలో… ఇంకొందరు సెల్‌ఫోన్లనో… బ్యాగుల్లో… బూట్లలో బంగారం తేవడం చూశాం. కానీ కుక్కర్లో కనకం గురించి ఎప్పుడైనా విన్నారా? కేరళలోని కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఇన్సిడెంట్‌ ఔరా అనిపించింది. . రోజువారీ తనిఖీల్లో భాగంగా…ఎయిర్ ఇంటెలిజెన్స్‌ యూనిట్ విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను, వారి లగేజ్‌ను తనిఖీ చేస్తోంది. ఓ లగేజ్‌ తనిఖీ చేస్తుండగా…అందులో ఒక కుక్కర్ కనిపించింది. అనుమానం వచ్చి కుక్కర్ పరిశీలించగా..700 గ్రాముల బంగారం బయటపడింది. జెడ్డా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి అధికారులు ఆ బంగారం స్వాధీనం చేసుకన్నారు.

* కెవిపల్లి మండలం గ్యారంపల్లి కస్పా బస్టాండ్ దగ్గర జాతీయ రహదారి పై చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు చిన్నగొటిఘల్లు కు చెందిన శంకరయ్య తన బార్య రెడ్డమ్మ, కుమారుడు అకిల్ తో కలిసి తన ద్విచక్ర వాహనంలో దేవపట్లకు కూలి పనుల నిమిత్తం వెళుతుండగా మార్గమధ్యంలో కెవిపల్లి మండలం గ్యారంపల్లి కస్పా బస్టాప్ వద్ద వెనుక వైపు నుంచి పీలేరు నుంచి రాయచోటి వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో ముగ్గురు క్రింద పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

* మచిలీపట్నంలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన పద్మ మృతదేహం హైదరాబాద్ నార్కెట్‌పల్లి వద్ద లభ్యమైంది. అత్యంత దారుణంగా పద్మను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు.  మచిలీపట్నం వాణి జనరల్ స్టోర్స్‌లో పనిచేస్తున్న పద్మ. ఎవరూ లేకపోవడంతో, ఒంటరిగానే జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆగష్టు 31న సాయంత్రం. పద్మను చేసిన గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. కాగా పద్మ మృతదేహం నిన్న హైదరాబాద్ నార్కెట్‌పల్లి వద్ద గుర్తించడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పద్మ టిక్ టాక్ వీడియోల ఆధారంగా ఆమెను తీసుకు వెళ్ళారా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందరితో కలివిడిగా ఉండే పద్మ  దారుణ హత్యకు గురికావడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒంటరి మహిళను కేవలం నగలు, డబ్బు కోసమే హతమార్చారని  స్థానిక మహిళలు ఆరోపిస్తున్నారు.

* స్కూటీ స్టాండ్‌ తీయకుండా వెళుతుండగా.. అది రోడ్డుకు తగిలి పడిపోవడంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పాలకోడేరు మండలం పెన్నాడ లో శుక్రవారం చోటు చేసుకున్న ప్రమాదం వివరాలివి.. భీమవరానికి చెందిన ఎక్కిడి దుర్గారావు(35) పాలకొల్లు వైపు నుంచి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో స్కూటీపై వెళుతున్నాడు. పెన్నాడలోని రావిచెట్టు సెంటర్‌ సమీపంలోకి వచ్చే సరికి స్కూటర్‌కు ఉన్న స్టాండ్‌ తీయకపోవడంతో అది రోడ్డుకు తగిలి పడిపోయారు. గ్రామానికి చెందిన మహిళా పోలీసులు అరుణజ్యోతి, దుర్గాభవానీ 108కు సమాచారం అందించారు. భీమవరానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ అది సకాలంలో రాకపోవడంతో ఆ వ్యక్తి మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎట్టకేలకు 108 సిబ్బంది వచ్చి మృతి చెందాడని చెప్పి వెనుతిరిగారు. దుర్గారావుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

* వినుకొండ పట్టణం పసుపు లేరు బ్రిడ్జి పై నుండి టమోటా, కూరగాయలు లోడు మినీ వాహనం (అశోక్ లేలాండ్) దూసుకువెళ్లి బోల్తా కొట్టింది. అనంతపురం నుండి నకరికల్లు కూరగాయలు దిగుమతి చేసేందుకు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. వాహనం బోల్తా కొట్టిన ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి అపాయం లేదు.

* విశాఖ జిల్లా రోలుగుంట మండలం కుసర్లపూడి గ్రామ వాలంటీర్ తోతడి నానాజీపై అత్యాచారయత్నం కేసు నమోదైంది. ఈ నెల 3వ తేదీన ఇదే గ్రామానికి చెంది పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించినట్లు రోలుగుంట పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై దర్యాప్తు చేసి వాలంటీర్ నానాజీ పై కేసు నమోదు చేసినట్లు రోలుగుంట ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు.

* క‌న్న‌డ హీరోయిన్ సంయుక్త హెగ్డేపై సామాజిక కార్య‌క‌ర్త‌లం అంటూ ప‌దిమంది యువకులు దాడి చేశారు. బెంగ‌ళూరులోని ప‌బ్లిక్ పార్క్‌లో స్నేహితురాలితో క‌లిసి వ‌ర్కవుట్స్ చేస్తున్న క్ర‌మంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది.