WorldWonders

భారతీయుడికి ₹20కోట్ల లాటరీ

This UAE NRI Indian Wins Lottery Worth 20Crore Rupees

యూఏఈలోని ఉంటున్న భారతీయుడొకరు లాటరీలో భారీ మొత్తం గెలుచుకున్నారు. షార్జాలోని ఓ ఐటీ కంపెనీకి మేనేజర్‌గా పనిచేస్తున్న గుర్‌ప్రీత్‌ సింగ్‌(35) 10 మిలియన్‌ దిర్హామ్స్‌(సుమారు 19.90 కోట్లు) గెలుచుకున్నట్లు ఖలీజ్‌ టైమ్స్‌ తెలిపింది. పంజాబ్‌కు చెందిన గుర్‌ప్రీత్‌ ఆగస్టు 12వ తేదీన లాటరీ టికెట్‌ కొన్నారు. ఈ నెల 3వ తేదీన బిగ్‌ టికెట్‌ లాటరీ సంస్థ ప్రకటించిన ఫలితాల్లో గురుప్రీత్‌ సింగ్‌ జాక్‌పాట్‌ గెలుచుకున్నారు. రెండేళ్ల నుంచి బిగ్‌ టికెట్‌ లాటరీ టికెట్‌ కొనుగోలు చేస్తున్న గురుప్రీత్‌ను ఎట్టకేలకు అదృష్టం వరించింది. ఈ డబ్బుతో దుబాయ్‌లో ఇల్లు కొనుక్కుని, పంజాబ్‌లో ఉంటున్న వృద్ధ తల్లిదండ్రులను తీసుకువస్తానని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ చెప్పారు.