Health

హరీష్‌రావుకు కరోనా-TNI బులెటిన్

హరీష్‌రావుకు కరోనా-TNI బులెటిన్

* తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు కు కరోనా పాజిటివ్.

* దేశంలో కరోనావైరస్ కేసుల ఉధృతి పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. లాక్‌డౌన్ వ్యూహం నుంచి ప్రయోజనాన్ని పొందలేని ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశమేనని వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ ద్వారా అన్ని దేశాలు కరోనా మహమ్మారిని అదుపు చేస్తే భారత్‌లో మాత్రం కరోనా విజృంభిస్తోందన్నారు. ఈమేరకు శనివారం ఆయన వరుస ట్వీట్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై దాడి చేశారు.

* అసలే ఇది కరోనా కాలం.. ప్రజలంతా భయంతో వణికిపోతున్న సమయం. ఇలాంటి విపత్కర సమయంలో జనం భయాన్ని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించాడో వైద్యుడు, అతడి సహాయకుడు. తమ వద్దకు కరోనా పరీక్షల కోసం వచ్చే వారికి నకిలీ రిపోర్టులు ఇచ్చి మోసగిస్తూ ప్రాణాలతో చెలగాటమాడిన ఇద్దరు ప్రబుద్ధులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నిందితులు దిల్లీలోని మాలవీయనగర్‌కు చెందిన వైద్యుడు కుష్‌ బిహారి పరాశర్‌, అతడి సహాయకుడు అమిత్‌ సింగ్‌గా గుర్తించినట్టు ‌ పోలీసులు తెలిపారు.

* రాజ్యసభ సభ్యులను కరోనా భయం వేధిస్తోంది. ఈ నెల 14వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజ్యసభ సభ్యుల ఆరోగ్యంపై వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సభలోని సభ్యుల్లో అత్యధిక శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారే కావడం. ఆ వయసు వారిలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటున్న నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.