Sports

శానిటైజర్‌తో వికెట్లు పడగొట్టిన బౌలర్

శానిటైజర్‌తో వికెట్లు పడగొట్టిన బౌలర్

కరోనా భయం నుంచి క్రీడాలోకం నెమ్మదిగా కోలుకుంటోంది. కరోనా భయంతో బంతికి ఉమ్మి కూడా రాయొద్దని ఐసీసీ కొత్త నిబంధనలు తెచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఓ బౌలర్ తన వద్ద ఉన్న హ్యండ్ శానిటైజర్‌ను బంతికి పూసి బౌలింగ్ చేశాడు. ఆస్ట్రేలియాకు చెందిన మిచ్ క్లేడన్ అనే బౌలర్ ఈ పని చేశాడు. ఇంగ్లండ్ కౌంటీ జట్టు ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను.. గత నెల జరిగిన ఓ మ్యాచ్‌లో బంతికి శానిటైజర్ పూసి బౌలింగ్ చేశాడు. బాబ్ విల్లీస్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో క్లేడన్ మూడు వికెట్లు కూడా తీశాడు. అయితే శానిటైజర్ బంతికి పూసినట్లు తెలిసిన ససెక్స్ జట్టు యాజమాన్యం.. క్లేడన్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది